మూడేళ్ళకు వచ్చే విభువన సంకష్ట చతుర్థి.. ఈరోజు చేయాల్సినవి, చదువుకోవాల్సిన వినాయక శ్లోకాలు ఇవిగో!

ప్రతి మూడేళ్లకు ఒకసారి వచ్చే అరుదైన విభువన సంకష్ట చతుర్థి విశేషాలు మీకోసం. బుధవారం నాటి ఈ విశేష పర్వదినాన వినాయకుడి అనుగ్రహం కోసం పఠించాల్సిన 9 శక్తివంతమైన శ్లోకాలు, పూజా విధానం ఇక్కడ చూడండి.

Published on: Jun 3, 2026, 08:01:09 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థిగా మనం పిలుస్తాము. అడ్డంకులను తొలగించే రోజుగా భావించే వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తాము. సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. సర్వాభీష్టాలు చేకూరుతాయి. ప్రతి నెలలో వచ్చే కృష్ణపక్షం నాలుగవ రోజు సంకటహర చతుర్థిని జరుపుకుంటాము. ఈరోజు వచ్చిన సంకటహర చతుర్థి మామూలుదే కాదు. ప్రతి మూడేళ్లకు ఒకసారి వచ్చే చతుర్థి. ఇది చాలా విశేషమైనదని చెప్పొచ్చు.

మూడేళ్ళకు వచ్చే విభువన సంకష్ట చతుర్థి.. ఈరోజు చేయాల్సినవి, చదువుకోవాల్సిన వినాయక శ్లోకాలు ఇవిగో! (pinterest)
మూడేళ్ళకు వచ్చే విభువన సంకష్ట చతుర్థి.. ఈరోజు చేయాల్సినవి, చదువుకోవాల్సిన వినాయక శ్లోకాలు ఇవిగో! (pinterest)

అధిక మాసంలో వచ్చే ఈ విభువన సంకష్ట చతుర్థి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కాబట్టి ఈరోజును సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం మంచిది. అలాగే ఈ ప్రత్యేకమైన రోజున ఉపవాసం ఉండి, చంద్రుని పూజించి, వినాయకుడిని ప్రత్యేకించి ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. చంద్రుని పూజతో ఉపవాసం పూర్తవుతుంది.

విభువన సంకష్ట చతుర్థి + బుధవారం

ఈ విభువన సంకష్ట చతుర్థి బుధవారం రావడం మరింత విశేషమైనదని చెప్పొచ్చు. ఈ కలయిక సంతోషాన్ని, శ్రేయస్సును తీసుకువస్తుంది. శివుడికి బెల్లం, నల్ల నువ్వుల లడ్డులను ఈ సంకష్ట చతుర్థి రోజున నైవేద్యంగా సమర్పిస్తే ఎంతో మంచి జరుగుతుంది. అలాగే రాహు, కేతువుల ప్రభావాలను తగ్గించడానికి కుంకుమను పూజ చేసేటప్పుడు సమర్పించాలి. ఈ వినాయకుని శ్లోకాలను ప్రత్యేకమైన రోజున చదువుకుంటే విఘ్నాలు తొలగిపోయి, వినాయకుని అనుగ్రహాన్ని పొందవచ్చు.

వినాయక శ్లోకాలు

1. వక్రతుండ మహాకాయ శ్లోకం

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా

2. గణపతి ధ్యాన శ్లోకం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

3. గజానన శ్లోకం

గజాననం భూతగణాది సేవితం

కపిత్థ జంబూ ఫలసార భక్షితమ్

ఉమాసుతం శోక వినాశ కారణమ్

నమామి విఘ్నేశ్వర పాద పంకజమ్

4. ఏకదంత స్తుతి

ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభమ్

లంబోదరం విశాలాక్షం వందే హం గణనాయకమ్

5. ముదాకరాత్త మోదకం

ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం

కళాధరావతంసకం విలాసిలోక రక్షకం

అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం

నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్

6. గణపతి గాయత్రీ మంత్రం

ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్

7. లంబోదరాయ నమస్తుభ్యం

లంబోదరాయ నమస్తుభ్యం

సతతం మోదకప్రియ

నిర్విఘ్నం కురు మే దేవ

సర్వకార్యేషు సర్వదా

8. విఘ్నేశ్వర ప్రార్థన

ఓం గం గణపతయే నమః

9. సిద్ధి బుద్ధి ప్రదే దేవ

సిద్ధి బుద్ధి ప్రదే దేవ

భుక్తి ముక్తి ప్రదాయక

మంత్రమూర్తే సదా దేవ

మహాగణపతే నమః

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More