June Financial Horoscope: జూన్ నెలలో గ్రహాల మార్పుతో ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఆ రాశులకు భారీగా డబ్బు!

జూన్ నెలలో గురువు, సూర్యుడు వంటి ప్రధాన గ్రహాల సంచారం వల్ల 12 రాశుల ఆర్థిక స్థితిగతుల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఎవరికి అదృష్టం పడుతుంది? ఎవరికి ఖర్చులు పెరుగుతాయి? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Published on: May 29, 2026, 14:00:51 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జూన్ 2026లో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పులు రాబోతున్నాయి. ఈ గ్రహాల సంచారంలో మార్పు వలన 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. గురువు జూన్ 2న తన సంచారంలో మార్పు చేస్తాడు. అలాగే శుక్రుడు, సూర్యుడు ఇలా ఇతర ప్రధాన గ్రహాల సంచారంలో కూడా మార్పు వస్తుంది. దీంతో 12 రాశుల వారి ఆర్థిక జీవితంపై ఎంతో ప్రభావం పడుతుంది. మరి 12 రాశుల వారికి ఆర్థికపరంగా జూన్ నెలలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఆర్థిక ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

June Financial Horoscope: జూన్ నెలలో గ్రహాల మార్పుతో ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఆ రాశులకు భారీగా డబ్బు! (pinterest)
June Financial Horoscope: జూన్ నెలలో గ్రహాల మార్పుతో ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఆ రాశులకు భారీగా డబ్బు! (pinterest)

జూన్ 2026లో 12 రాశుల వారి ఆర్థిక జీవితం ఎలా ఉంటుంది?

మేష రాశి:

మేష రాశి వారు ఈ నెలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చాలా కాన్ఫిడెన్స్‌గా, ధైర్యంగా ఉంటారు. కెరీర్‌లో మంచి మలుపు ఉంటుంది. కమ్యూనికేషన్ పరంగా బాగుంటుంది. సీనియర్ ఆఫీసర్ల నుంచి ప్రశంసలు పొందుతారు. ప్రమోషన్లు, కొత్త బాధ్యతలను చేపడతారు. జూన్ 15 తర్వాత పనికి సంబంధించి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. ఆర్థికపరంగా బాగుంటుంది.

వృషభ రాశి:

వృషభ రాశి వారు కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఈ నెలలో ఈ రాశి వారు కొత్త అవకాశాలను పొందుతారు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.

మిథున రాశి:

మిథున రాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పని ప్రదేశంలో చక్కటి మార్పులు చూస్తారు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారు జూన్ నెలలో సహనంతో ఎక్కువ శ్రమిస్తారు. కెరీర్‌లో పురోగతిని చూస్తారు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పని ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి.

సింహ రాశి:

సింహ రాశి వారికి ఈ నెల ఆర్థికపరంగా బాగానే ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు కూడా పెంపొందించుకుంటారు. కొత్త కాంటాక్ట్స్ ద్వారా కొత్త అవకాశాలను పొందుతారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందుతారు.

కన్యా రాశి:

కన్యా రాశి వారికి కెరీర్ పరంగా ఈ నెల చాలా ముఖ్యమైనది. పని ప్రదేశంలో కాస్త ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. సీనియర్ ఆఫీసర్లతో దగ్గరగా పనిచేస్తారు. కొత్త అవకాశాలను పొందుతారు.

తులా రాశి:

తులా రాశి వారికి ఇది శుభ సమయం. ఈ నెల ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. జూన్ 15 వరకు ఆర్థికపరంగా లాభాలు ఉంటాయి. కానీ బాధ్యతలు బాగా ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించాలి.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి మానసికంగా, శారీరకంగా కష్టతరంగా ఉంటుంది. పని పూర్తి చేసేటప్పుడు ఏకాగ్రతతో ఉండాలి. కెరీర్‌లో మంచి మార్పులు చూస్తారు. టీం వర్క్ ద్వారా సక్సెస్‌ను అందుకుంటారు.

ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారు కెరీర్ పరంగా అనేక మార్పులను చూస్తారు. టీం వర్క్ బాగా కలిసి వస్తుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కెరీర్‌లో మంచి గ్రోత్ ఉంటుంది. ఆదాయం కూడా పెరుగుతుంది.

మకర రాశి:

మకర రాశి వారికి పని, పర్సనల్ లైఫ్ మధ్య బ్యాలెన్స్ ఉంటుంది. బాధ్యతలు, ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా పని ప్రదేశంలో మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.

కుంభ రాశి:

కుంభ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ నెల బాగానే ఉంటుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. స్థిరత్వం ఉంటుంది. తోటి ఉద్యోగస్తుల సపోర్ట్ ఉంటుంది. కష్టమైన పరిస్థితులను కూడా కాన్ఫిడెన్స్‌తో జాగ్రత్తగా ఎదుర్కొంటారు.

మీన రాశి:

మీన రాశి వారికి ఈ నెలలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులకు భారీగా లాభాలు ఉంటాయి. పని ప్రదేశంలో అన్ని సానుకూలంగా ఉండడంతో ఒత్తిడి కూడా తగ్గుతుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More