...
...
Next Story

సిడ్నీ కాల్పుల ఘటనలో హైదరాబాద్ లింక్ అవమానమే.. ఇక్కడ స్లీపర్ సెల్స్ ఉండొచ్చు : తెలంగాణ బీజేపీ

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన వ్యక్తులకు హైదరాబాద్‌తో సంబంధం ఉండటం అవమానకరం అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అన్నారు.

Published on: Dec 17, 2025, 16:15:44 IST
Advertisement

ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండి బీచ్‌లో యూదులు హనుక్కా ఉత్సవం జరుపుకొంటుండగా.. ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఇద్దరు వ్యక్తులు కాల్పులు చేశారు. ఈ ఘటనలో 15 మంది మృతిచెందారు. ఈ దాడి చేసినవారిలో ఒకరైన సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌ టోలిచౌకికి చెందినవాడు. మరో వ్యక్తి అతడి కుమారుడు, ఆస్ట్రేలియా పౌరుడైన నవీద్ అక్రమ్.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు

ఈ కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి పాల్గొనడం భారతదేశానికి అవమానం మాత్రమే కాదు, భద్రతాపరమైన ఆందోళన కూడా అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అన్నారు. 'ఆస్ట్రేలియాలో సిడ్నీ ఉగ్రవాద చర్యతో హైదరాబాద్ సంబంధం, మాకు అవమానకరమైన విషయమే. అంతేకాదు ఇది తీవ్రమైన జాతీయ భద్రతా సమస్య కూడా.' అని రామచందర్ రావు చెప్పారు.

నిందితులు భారతదేశం విడిచి వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపి దర్యాప్తు చేయాలని తెలంగాణ పోలీసులను రామచందర్ రావు కోరారు. ఈ సంఘటన ప్రమాదకరమైన ధోరణిని ప్రతిబింబిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుల కుటుంబ చరిత్రపై పోలీసు విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

'దురదృష్టవశాత్తు, ఇందులో పాల్గొన్న వ్యక్తులు భారతదేశానికి చెందినవారు, అది కూడా హైదరాబాద్‌కు చెందినవారు. 27 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నుండి బయటకు వెళ్లారు. హైదరాబాద్‌లో ఇప్పటికీ ఐఎస్ఐ, ఐఎస్ఐఎస్ కోసం చాలా స్లీపర్ సెల్స్ ఉన్నాయని నేను భావిస్తున్నాను.' అని తెలంగాణ బేజీపీ అధ్యక్షుడు చెప్పాడు.

సిడ్నీలోని బోండి బీచ్‌లో జరిగిన హనుక్కా కార్యక్రమంలో 50 ఏళ్ల సాజిద్ అక్రమ్, అతడి కుమారుడు నవీద్ అక్రమ్ దాడి చేశారు. 15 మంది మరణించగా, అనేక మందికి గాయాలు అయ్యాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో సాజిద్ అక్కడే మరణించాడు. నవీద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సాజిద్ అక్రమ్ గురించి దర్యాప్తు బృందాలు ఆరా తీస్తున్నాయి. అతను చివరిసారిగా 2022లో హైదరాబాద్ వచ్చాడు. అది కూడా ఆస్తులకు సంబంధించిన వ్యవహారంపై వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాత మెుత్తం ఆరుసార్లు వచ్చాడు సాజిద్. సాజిత్ అక్రమ్ తండ్రి 2017 లో మరణించాడు. ఆయన అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు.

హైదరాబాద్‌లో కామర్స్‌లో బ్యాచిలర్స్ పూర్తి చేసిన తర్వాత 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. అక్రమ్ ఆస్ట్రేలియాకు వెళ్లి ఒక యూరోపియన్ మహిళను వివాహం చేసుకున్నాడు. అతడికి ఒక కుమారుడు(నవీద్ అక్రమ్), కుమార్తె ఉన్నారు. సాజిద్ తన భారతీయ పాస్‌పోర్ట్‌ను తన వద్దే ఉంచుకున్నాడు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe