సిడ్నీ ఉగ్రదాడి నిందితుడు హైదరాబాద్ టోలిచౌకికి చెందిన వ్యక్తి.. వెలుగులోకి కీలక విషయాలు!

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఒకరు హైదరాబాద్ టోలిచౌకి వ్యక్తిగా గుర్తించారు.

Published on: Dec 16, 2025, 18:04:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇటీవల ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండి బీచ్‌లో యూదులు హనుక్కా ఉత్సవం చేసుకుంటుండగా ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఇద్దరు వ్యక్తులు కాల్పులు చేశారు. ఈ ఘటనలో 15 మంది మరణించారు. ఉగ్రవాదులలో ఒకరైన సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌ టోలిచౌకికి చెందినవాడని అధికారులు గుర్తించారు. మరో వ్యక్తి అతడి కుమారుడు, ఆస్ట్రేలియా పౌరుడైన నవీద్ అక్రమ్. అయితే హైదరాబాద్‌లో అతని కుటుంబంతో సంబంధాలు తక్కువగా ఉన్నాయని పోలీసులు తెలిపారు.

సిడ్నీ ఉగ్రదాడి ఘటన స్థలం
సిడ్నీ ఉగ్రదాడి ఘటన స్థలం

సాజిద్ అక్రమ్ తీవ్రవాద మనస్తత్వం, కార్యకలాపాల గురించి లేదా అతని తీవ్రవాదానికి ఆకర్శితుడు అవ్వడానికి దారితీసిన పరిస్థితుల గురించి కుటుంబ సభ్యులు తమకు తెలియదని చెప్పారని తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. సాజిద్ అక్రమ్, అతని కుమారుడు 24 ఏళ్ల నవీద్ అక్రమ్ ఈ దాడికి పాల్పడ్డారు. 15 మందిని చంపి, అనేక మందిని గాయపరిచారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఎదురుకాల్పులు జరపగా ఆ కాల్పుల్లో సాజిద్ అక్రమ్ మరణించాడు. అతడి కుమారుడు నవీద్ అక్రమ్ గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సాజిద్ అక్రమ్ గురించి దర్యాప్తు బృందాలు ఆరా తీస్తున్నాయి. అతను చివరిసారిగా 2022లో హైదరాబాద్ వచ్చాడు. అది కూడా ఆస్తులకు సంబంధించిన వ్యవహారంపై వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాత మెుత్తం ఆరుసార్లు వచ్చాడు సాజిద్. సాజిత్ అక్రమ్ తండ్రి 2017 లో మరణించాడు. ఆయన అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు.

హైదరాబాద్‌లో కామర్స్‌లో బ్యాచిలర్స్ పూర్తి చేసిన తర్వాత 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. అక్రమ్ ఆస్ట్రేలియాకు వెళ్లి ఒక యూరోపియన్ మహిళను వివాహం చేసుకున్నాడు. అతడికి ఒక కుమారుడు(నవీద్ అక్రమ్), కుమార్తె ఉన్నారు. సాజిద్ తన భారతీయ పాస్‌పోర్ట్‌ను తన వద్దే ఉంచుకున్నాడు.

సాజిద్ అక్రమ్ కుటుంబం హైదరాబాద్‌లో నివసిస్తుందని, ఆయన అన్నయ్య ఒక వైద్యుడు అని ఓ అధికారి తెలిపారు. ఆయన తండ్రి 1984లో యూఏఈలో సైన్యం నుండి పదవీ విరమణ చేశారు. పోలీసుల కాల్పుల్లో గాయపడి ఆసుపత్రిలో చేరిన సాజిద్ కుమారుడు నవీద్ 2001లో ఆస్ట్రేలియాలో జన్మించాడు. ఆస్ట్రేలియా పౌరుడు.

ప్రాథమిక దర్యాప్తులో ఇప్పటివరకు సాజిత్ అక్రమ్‌కు స్థానిక సంబంధాలపై ఎలాంటి వివరాలు తెలియలేదు. దర్యాప్తు గురించి ఆస్ట్రేలియా అధికారులు భారత అధికారులతో సంప్రదిస్తున్నారు. సాజిద్ అక్రమ్ నవంబర్‌లో భారతీయ పాస్‌పోర్ట్‌పై ఫిలిప్పీన్స్‌కు ప్రయాణించాడని, అతడితో కుమారుడు నవీద్ అక్రమ్‌ కూడా ఉన్నాడని ఫిలిప్పీన్స్ ఇమ్మిగ్రేషన్ అధికారులు వెల్లడించారు.

'భారతీయ జాతీయుడు సాజిద్ అక్రమ్(50), ఆస్ట్రేలియా జాతీయుడు నవీద్ అక్రమ్ (24) గత నవంబర్ 1, 2025న ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుండి ఫిలిప్పీన్స్‌కు చేరుకున్నారు.' అని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ బ్యూరో ప్రతినిధి డానా సాండోవాల్ మంగళవారం వార్తా సంస్థలకు తెలిపారు.

ఉగ్రదాడి చేసిన వారి మూలాలపై వ్యాఖ్యానించడానికి ఆస్ట్రేలియా అధికారులు నిరాకరించారు. సాజిద్ అక్రమ్ భారతదేశానికి చెందినవాడా లేదా పాకిస్తాన్‌కు చెందినవాడా అని అడిగినప్పుడు, అటువంటి వివరాలు దర్యాప్తులో భాగమని చెప్పారు. ఆ వివరాలను ఇప్పుడు చెప్పలేమని స్పష్టం చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More