హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) పరిధిలోని సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (CSE-RCA) ఉచిత శిక్షణ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఆగస్టు 12 వరకు పొడిగించినట్లు వర్సిటీ యాజమాన్యం ప్రకటించింది. యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న మైనారిటీ వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మహిళా అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణా కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని CSE-RCA డైరెక్టర్ ప్రొఫెసర్ హెచ్. అలీమ్ బాషా తెలిపారు.
మనూలో సివిల్స్ కోచింగ్
{{^htLoading}} {{/htLoading}}
దరఖాస్తు గడువు పొడిగింపు నేపథ్యంతో పాటు ఎంట్రన్స్ పరీక్ష తేదీలలో కూడా మార్పులు చేశారు. రాత పరీక్ష (ఎంట్రన్స్ టెస్ట్) ఆగస్టు 16న నిర్వహిస్తారు. వ్యాసరూప పరీక్ష, ఇంటర్వ్యూలు ఆగస్టు 24 నుండి 28 వరకు జరుగుతాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మనూ (MANUU) అధికారిక రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించవచ్చు. కోచింగ్, ప్రవేశాల నిబంధనలు మరియు వసతికి సంబంధించిన సమగ్ర వివరాల కోసం విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఏవైనా సందేహాలు లేదా సందేహాల నివృత్తి కోసం CSE-RCA అధికారిక ఈమెయిల్ (csercamanuu@gmail.com) ద్వారా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. మనూ రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ యూజీసీ, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో నడుస్తోంది. ఇక్కడ ఎంపికైన అభ్యర్థులకు యూపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్ శిక్షణతో పాటు లైబ్రరీ, 24/7 రీడింగ్ హాళ్లు, హాస్టల్, మాక్ ఇంటర్వ్యూల సౌకర్యాలు లభిస్తాయి. సివిల్ సర్విసెస్‌లో రాణించాలనుకునే అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.