హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అప్పులను తీర్చడం(రీఫైనాన్స్) కోసం ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ సంస్థకు.. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) రూ.13,527 కోట్ల భారీ రుణాన్ని మంజూరు చేసింది. ఈ డీల్ వార్త బయటకు రాగానే షేర్ మార్కెట్‌లో ఐఆర్‌ఎఫ్‌సీ షేర్లు 4 శాతం పెరిగి రూ.102 కి చేరుకున్నాయి.
మెట్రో ప్రాజెక్ట్ కోసం గతంలో ఎక్కువ వడ్డీకి తీసుకున్న పాత అప్పులను తీర్చేసి.. వాటి స్థానంలో తక్కువ వడ్డీకి, ఎక్కువ కాలపరిమితితో కొత్త అప్పును తీసుకోవడాన్నే 'రీఫైనాన్సింగ్' అంటారు. ఈ రూ13,527 కోట్ల రుణాన్ని 20 ఏళ్ల పాటు ప్రతి మూడు నెలలకొకసారి ఈఎంఐ (త్రైమాసిక వాయిదాలు) రూపంలో మెట్రో సంస్థ చెల్లిస్తుంది.
ఈ అప్పు తీసుకోవడానికి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు గానీ, ముందే అప్పు తీర్చేస్తే వేసే పెనాల్టీలు గానీ లేవు. దీనివల్ల మెట్రో ప్రాజెక్టుపై ఆర్థిక భారం చాలా వరకు తగ్గుతుంది.
ప్రస్తుత మెట్రో పరిస్థితి?
హైదరాబాద్ మెట్రో ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే.. హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 ప్రాజెక్టులో 3 కారిడార్లలో 57 స్టేషన్లతో మొత్తం 69.2 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) మోడల్‌లో ప్రపంచంలోనే నిర్మించిన అతిపెద్ద మెట్రో ప్రాజెక్టులలో ఇది ఒకటి. ప్రస్తుతం రోజూ 5 లక్షల మందికి పైగా ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు.
ఈ ఆర్థిక ఊరట వల్ల తెలంగాణ ప్రభుత్వం తదుపరి మెట్రో విస్తరణ పనులను (కొత్త రూట్లు, లాస్ట్ మైల్ కనెక్టివిటీ) మరింత వేగవంతం చేసే అవకాశం ఉంటుంది.
ఐఆర్‌ఎఫ్‌సీ సంస్థకు ఎందుకు ముఖ్యం?
సాధారణంగా IRFC సంస్థ కేవలం రైల్వే రంగానికి (రైళ్లు, పట్టాల నిర్మాణం) మాత్రమే నిధులు సమకూరుస్తుంది. కానీ ఇప్పుడు మొదటిసారిగా మెట్రో లాంటి పబ్లిక్ యుటిలిటీ (ప్రజా రవాణా) మౌలిక సదుపాయాలకు కూడా అప్పులు ఇవ్వడం ప్రారంభించింది. తమ వ్యాపారాన్ని ఇతర రంగాలకు విస్తరించడంలో ఇదొక పెద్ద అడుగు అని కంపెనీ పేర్కొంది.
షేర్ మార్కెట్‌లో ఐఆర్‌ఎఫ్‌సీ పరిస్థితి?
{{/usCountry}}సాధారణంగా IRFC సంస్థ కేవలం రైల్వే రంగానికి (రైళ్లు, పట్టాల నిర్మాణం) మాత్రమే నిధులు సమకూరుస్తుంది. కానీ ఇప్పుడు మొదటిసారిగా మెట్రో లాంటి పబ్లిక్ యుటిలిటీ (ప్రజా రవాణా) మౌలిక సదుపాయాలకు కూడా అప్పులు ఇవ్వడం ప్రారంభించింది. తమ వ్యాపారాన్ని ఇతర రంగాలకు విస్తరించడంలో ఇదొక పెద్ద అడుగు అని కంపెనీ పేర్కొంది.
షేర్ మార్కెట్‌లో ఐఆర్‌ఎఫ్‌సీ పరిస్థితి?
{{/usCountry}}జూలై 2024 లో ఈ షేర్ ధర అత్యధికంగా రూ.229 కి చేరింది. ఆ తర్వాత కాలంలో ఈ షేర్ భారీగా పతనమై దాదాపు 56 శాతం విలువను కోల్పోయింది. వరుసగా మూడేళ్లు లాభాలు ఇచ్చిన ఈ స్టాక్.. 2025లో 17 శాతం నష్టాన్ని మిగిల్చింది. ఈ 2026 సంవత్సరంలో కూడా ఇప్పటివరకు 20 శాతం మేర పడిపోయింది. ప్రస్తుతం జరిగిన ఈ రూ.13,527 కోట్ల మెట్రో డీల్ తర్వాత ఈ షేర్ మళ్లీ పుంజుకుంటుందని పెట్టుబడిదారులు ఆశిస్తున్నారు.