హైదరాబాద్ నివాసితులకు, రోజువారీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన శుభవార్త అందించింది. నగరంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థను సామాన్యులకు మరింత అందుబాటులోకి తేవడం, ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా కామన్ ట్రావెల్ పాస్ ధరలను భారీగా తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ మెట్రో రైల్, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) బస్సులలో ఒకే పాస్‌తో ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్న ఈ కామన్ పాస్ ధరలను దాదాపు సగానికి పైగా తగ్గించారు. ఈ వివరాలను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
డైలీ పాస్ ధర గతంలో రూ.400గా ఉండగా.. ప్రస్తుతం రూ.275కే అందుబాటులో ఉంటుంది. రూ.200 మెట్రో వాటా, రూ.75 ఆర్టీసీ వాట. మంత్లీ పాస్ ధరను రూ.8,500 నుంచి రూ.4,000కి తగ్గించారు. అంటే సగానికి పైగా ధర తగ్గింది. ఇందులో మెట్రో వాటా రూ.3,000, ఆర్టీసీ వాటా రూ.1,000గా ఉంది. ఈ నూతన సవరించిన ధరలు నవంబర్ 8 నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
నెలవారీ కామన్ ట్రావెల్ పాస్ వాడే ఉద్యోగులు, విద్యార్థులు ప్రతి నెల రూ.4,500 వరకు ప్రత్యక్షంగా ఆదా చేసుకోవచ్చు. డైలీ పాస్ వినియోగదారులు ప్రతిరోజూ రూ.125 ఆదా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ (మాదాపూర్, గచ్చిబౌలి), సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి వంటి ప్రధాన ప్రాంతాల్లో నిత్యం లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు ప్రయాణిస్తుంటారు.
మెట్రో స్టేషన్ల నుంచి ఆఫీసులకు చేరుకోవడానికి ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఆర్టీసీ బస్సులపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ రెండు వ్యవస్థలను సమగ్రంగా అనుసంధానించేందుకు తీసుకొచ్చిన ఈ కామన్ పాస్ విధానం, ధరల తగ్గింపు వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరనున్నాయి. పాస్ ధరలు తగ్గడం వల్ల ద్విచక్ర వాహనాలు, కార్లలో వెళ్లేవారు ప్రజా రవాణ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
{{/usCountry}}మెట్రో స్టేషన్ల నుంచి ఆఫీసులకు చేరుకోవడానికి ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఆర్టీసీ బస్సులపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ రెండు వ్యవస్థలను సమగ్రంగా అనుసంధానించేందుకు తీసుకొచ్చిన ఈ కామన్ పాస్ విధానం, ధరల తగ్గింపు వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరనున్నాయి. పాస్ ధరలు తగ్గడం వల్ల ద్విచక్ర వాహనాలు, కార్లలో వెళ్లేవారు ప్రజా రవాణ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
{{/usCountry}}నగరంలో సొంత వాహనాల రద్దీ తగ్గి, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జామ్‌లు తగ్గుతాయి. ప్రజారవాణాను ప్రోత్సహించడం ద్వారా కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది.
పాస్ ఎలా పొందాలి?
విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ పాస్ కౌంటర్లు, నిర్ణీత హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో ఈ కామన్ ట్రావెల్ పాస్‌లను కొనుగోలు చేయవచ్చు. త్వరలోనే క్యూఆర్ కోడ్, డిజిటల్ వ్యాలెట్ల ద్వారా కూడా ఫోన్‌లలోనే పాస్ బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు తెలిపారు.