గణేష్ నిమజ్జన శోభాయాత్రలను వీక్షించేందుకు, విగ్రహ నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైల్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 26 (శనివారం) అర్ధరాత్రి 1:00 గంట వరకు మెట్రో రైలు సేవలను పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నగరంలోని అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి చివరి మెట్రో రైలు అర్ధరాత్రి 1:00 గంటలకు బయలుదేరుతుందని అధికారులు స్పష్టం చేశారు.

భాగ్యనగరంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల అనంతరం జరిగే నిమజ్జన శోభాయాత్ర ప్రసిద్ధి చెందింది. ఖైరతాబాద్ మహాగణపతితో పాటు వేలాది విగ్రహాల నిమజ్జనాన్ని తిలకించేందుకు నగర నలుమూలల నుండే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలకు చేరుకుంటారు.
ఈ క్రమంలో నగర రోడ్లపై తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడే అవకాశం ఉంది. సొంత వాహనాల్లో వచ్చే ప్రయాణికులకు పార్కింగ్ స్థలాలు దొరకడం తీవ్ర సవాలుగా మారుతుంది. మెట్రో పొడిగించిన వేళల వల్ల వాహనాల రద్దీ, పార్కింగ్ ఇబ్బందులు తగ్గుతాయి.
రాత్రి వేళల్లో వేడుకలు పూర్తయిన తర్వాత క్షేమంగా ఇళ్లకు చేరుకోవడానికి కుటుంబ సమేతంగా వచ్చే భక్తులకు మెట్రో అత్యంత సురక్షితమైన రవాణా మార్గంగా ఉపయోగపడుతుంది. ప్రధాన టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు అర్ధరాత్రి ఒంటి గంటలకు బయల్దేరుతుంది.
రద్దీని క్రమబద్ధీకరించడానికి, ప్రయాణికుల రాకపోకలు సజావుగా సాగేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. క్యూ లైన్లలో నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు ప్రధాన స్టేషన్ల వద్ద అదనపు టికెటింగ్ కౌంటర్లు, డిజిటల్ క్యూఆర్ కోడ్ స్కేనింగ్ సదుపాయాలను పెంచారు.
ఖైరతాబాద్, లక్డీకాపూల్, అసెంబ్లీ, ఎంజీబీఎస్ వంటి కీలక స్టేషన్లలో అదనపు భద్రతా సిబ్బంది, స్పెషల్ బౌన్సర్లను రద్దీ నియంత్రణ కోసం రంగంలోకి దించుతున్నారు. గణేష్ నిమజ్జనానికి వెళ్లే భక్తులు ఆలస్యంగా ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యే క్రమంలో ఎలాంటి ఆందోళన చెందకుండా ఈ మెట్రో సేవలను వినియోగించుకోవాలని హైదరాబాద్ మెట్రో అధికారులు కోరారు. ప్రయాణికులు ముందస్తుగా మెట్రో యాప్ ద్వారా క్యూఆర్ టికెట్లు పొంది సమయాన్ని ఆదా చేసుకోవాలని సూచించారు.
ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు
{{/usCountry}}ఖైరతాబాద్, లక్డీకాపూల్, అసెంబ్లీ, ఎంజీబీఎస్ వంటి కీలక స్టేషన్లలో అదనపు భద్రతా సిబ్బంది, స్పెషల్ బౌన్సర్లను రద్దీ నియంత్రణ కోసం రంగంలోకి దించుతున్నారు. గణేష్ నిమజ్జనానికి వెళ్లే భక్తులు ఆలస్యంగా ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యే క్రమంలో ఎలాంటి ఆందోళన చెందకుండా ఈ మెట్రో సేవలను వినియోగించుకోవాలని హైదరాబాద్ మెట్రో అధికారులు కోరారు. ప్రయాణికులు ముందస్తుగా మెట్రో యాప్ ద్వారా క్యూఆర్ టికెట్లు పొంది సమయాన్ని ఆదా చేసుకోవాలని సూచించారు.
ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు
{{/usCountry}}నిమజ్జనం రోజుల్లో అర్ధరాత్రి వేళల్లో కూడా ప్రయాణికులకు రవాణా సదుపాయం కల్పించేందుకు ప్రత్యేక ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబరు 25-26, సెప్టెంబరు 26-27 తేదీల మధ్య రాత్రి 11:00 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 05:00 గంటల వరకు ఈ ప్రత్యేక ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి), లింగంపల్లి, ఫలక్‌నుమా వంటి కీలకమైన మార్గాలను కవర్ చేస్తూ ఈ సర్వీసులను నడుపుతారు.
సికింద్రాబాద్ - హైదరాబాద్: రాత్రి 11:50 గంటలకు బయలుదేరుతుంది.
హైదరాబాద్ - లింగంపల్లి: అర్ధరాత్రి 12:30 గంటలకు బయలుదేరుతుంది.
లింగంపల్లి - హైదరాబాద్: రాత్రి 01:50 గంటలకు బయలుదేరుతుంది.
హైదరాబాద్ - సికింద్రాబాద్: తెల్లవారుజామున 03:30 గంటలకు బయలుదేరుతుంది.
హైదరాబాద్ - లింగంపల్లి: రాత్రి 11:10 గంటలకు బయలుదేరుతుంది.
లింగంపల్లి - ఫలక్‌నుమా: అర్ధరాత్రి 12:10 గంటలకు బయలుదేరుతుంది.
ఫలక్‌నుమా - సికింద్రాబాద్: రాత్రి 02:20 గంటలకు బయలుదేరుతుంది.
సికింద్రాబాద్ - హైదరాబాద్: తెల్లవారుజామున 04:00 గంటలకు బయలుదేరుతుంది.
ఈ ప్రత్యేక MMTS రైళ్లు ఆయా మార్గాల్లో ఉన్న అన్ని సాధారణ ఎమ్‌ఎమ్‌టీఎస్ స్టేషన్లలోనూ ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. దీనివల్ల నగరంలోని ఏ ప్రాంతం నుంచి వచ్చే భక్తులైనా సరే.. తమకు సమీపంలో ఉన్న స్టేషన్‌లో రైలు ఎక్కడానికి లేదా దిగడానికి సులభంగా ఉంటుంది.