Hyderabad Outer Ring Road safety: హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా భావించే ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ఇప్పుడు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. గంటకు 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించే ఈ రహదారిపై చిన్నపాటి అజాగ్రత్త కూడా ప్రాణాపాయానికి దారితీస్తోంది.
ఈ నేపథ్యంలో వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీస్ యంత్రాంగం, రోడ్డు భద్రతా విభాగం కీలక హెచ్చరికలు జారీ చేశాయి. ఓఆర్ఆర్ పై ప్రయాణించేటప్పుడు పాటించాల్సిన భద్రతా ప్రోటోకాల్స్‌ను విస్మరిస్తే ప్రాణాలకే కాదు, మీ జేబుకు కూడా చిల్లు పడటం ఖాయమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి…?
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు బ్రేక్ డౌన్ వంటి అనివార్య కారణాలు మినహా, ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను రహదారిపై నిలపకూడదు. చాలామంది విశ్రాంతి కోసమో, ఫోన్ మాట్లాడటానికో లేదా ఫోటోల కోసమో వాహనాలను రోడ్డు పక్కన ఆపుతుంటారు. హై స్పీడ్ కారిడార్ అయిన ఓఆర్ఆర్ పై ఇలా వాహనాలు ఆపడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనాలు వేగాన్ని నియంత్రించలేక ఢీ కొంటున్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో మరణాల రేటు అత్యధికంగా ఉంటోందని ట్రాఫిక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
14449 హెల్ప్ లైన్…
ఒకవేళ మీ వాహనం సాంకేతిక లోపంతో ఆగిపోయినా లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే అధికారులు లేదా ఔటర్ రింగ్ రోడ్డును సంప్రదించవచ్చు. కొన్ని ముఖ్యమైన సూచనలు…
- తక్షణమే 14449 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలి.
- సమాచారం అందుకున్న వెంటనే పెట్రోలింగ్ వాహనాలు అక్కడికి చేరుకుని తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తాయి.
- భద్రతా కోన్లు (Safety Cones) లేదా ఇతర హెచ్చరిక గుర్తులు ఏర్పాటు చేసిన తర్వాతే వాహనాన్ని ఎడమ వైపు చివరి లేన్ (Shoulder Lane) లో నిలపాలి.
- వాహనం దిగిన వారు కూడా రోడ్డుపైకి రాకుండా జాగ్రత్త పడాలి.
ఈ నియమాలు కేవలం ఔటర్ రింగ్ రోడ్డుకే పరిమితం కాదని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఏ జాతీయ రహదారి పై ప్రయాణించేటప్పుడైనా ఈ భద్రతా సూత్రాలను విధిగా పాటించాలి. హైవేల మీద ఇష్టానుసారంగా వాహనాలు నిలపడం వల్ల అమాయక ప్రయాణికులు బలవుతున్నారు. ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు, కార్పొరేట్ సంస్థలు తమ డ్రైవర్లకు, సిబ్బందికి ఈ భద్రతా నియమాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
{{/usCountry}}ఈ నియమాలు కేవలం ఔటర్ రింగ్ రోడ్డుకే పరిమితం కాదని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఏ జాతీయ రహదారి పై ప్రయాణించేటప్పుడైనా ఈ భద్రతా సూత్రాలను విధిగా పాటించాలి. హైవేల మీద ఇష్టానుసారంగా వాహనాలు నిలపడం వల్ల అమాయక ప్రయాణికులు బలవుతున్నారు. ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు, కార్పొరేట్ సంస్థలు తమ డ్రైవర్లకు, సిబ్బందికి ఈ భద్రతా నియమాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
{{/usCountry}}నిబంధనలు అతిక్రమించి రహదారిపై అకారణంగా వాహనాలు నిలిపే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచుతూ, నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధిస్తారు.
“ప్రమాదాల నియంత్రణలో పోలీసులకు సహకరించి, మీ ప్రయాణాన్ని సురక్షితం చేసుకోవాలని కోరుతున్నాను. నిబంధనలు అతిక్రమించి రహదారిపై అకారణంగా వాహనాలు నిలిపే వారిపై కఠిన చర్యలతో పాటు భారీ జరిమానాలు విధిస్తాం. మీ భద్రతే మా బాధ్యత. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోండి” అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఓ ప్రకటన ద్వారా వాహనదారులకు సూచించారు.