Sign in

Free Summer Camp : చిన్నారులకు అదిరిపోయే ఛాన్స్ - హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఉచిత సమ్మర్ క్యాంప్, రిజిస్ట్రేషన్ తేదీలివే

Hyderabad Traffic Police Summer Camp : చిన్నారుల కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సమ్మర్ క్యాంప్ ను ప్రారంభించనుంది. హోండా సంస్థతో కలిసి  6-10 తరగతుల విద్యార్థుల కోసం గోషామహల్‌లో ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహించనుంది. 

Published on: May 3, 2026, 11:12:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Hyderabad Traffic Police Summer Camp : హైదరాబాద్ నగర పోలీసులు ప్రజలతో మమేకమవడానికి, ముఖ్యంగా భావి భారత పౌరులైన చిన్నారుల్లో క్రమశిక్షణ పెంపొందించడానికి మరో అడుగు ముందుకు వేశారు. 'సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్'లో భాగంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం ఒక అద్భుతమైన అవకాశాన్ని చిన్నారుల ముందుకు తెచ్చింది. హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (TTI)లో ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత సమ్మర్ క్యాంప్
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత సమ్మర్ క్యాంప్

తేదీలు…. నేర్పించే అంశాలు

ఈ శిక్షణ శిబిరం కేవలం రోడ్డు భద్రతకే పరిమితం కాకుండా, పిల్లల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేలా డిజైన్ చేశారు. మే 11, 2026 నుంచి మే 16, 2026 వరకు వారం రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఈ తరగతులు జరుగుతాయి. ఇందులో నేర్పించే ప్రధాన అంశాలు ఇవే:

  • రోడ్డు భద్రత - ట్రాఫిక్ అవగాహన: నిబంధనల పట్ల చిన్నతనం నుంచే బాధ్యత పెంచడం.
  • ఆత్మరక్షణ (Self Defence): అత్యవసర పరిస్థితుల్లో తమను తాము కాపాడుకునే మెళకువలు.
  • కళలు & సృజనాత్మకత: డ్యాన్స్, మ్యూజిక్, పెయింటింగ్ మరియు కార్టూనింగ్.
  • నైపుణ్యాల అభివృద్ధి: చేతిరాత మెరుగుపరచుకోవడం , వ్యక్తిత్వ వికాసం.
  • జీవిత రక్షణ: ప్రాథమిక అత్యవసర వైద్య చికిత్స (Basic Life Support) పై అవగాహన.

రిజిస్ట్రేషన్ వివరాలు….

ఈ శిబిరంలో పాల్గొనేందుకు 6వ తరగతి పూర్తి చేసిన విద్యార్థుల నుండి 10వ తరగతి చదువుతున్న బాలబాలికల వరకు అందరూ అర్హులు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 3, 2026 (ఆదివారం) నుండే ప్రారంభమవుతుంది. సీట్లు పరిమితంగా ఉన్నందున ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు వెంటనే తమ పిల్లల పేర్లను నమోదు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఈ కార్యక్రమం గురించి ఏదైనా సందేహాలుంటే గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్‌స్పెక్టర్ జి. హరీష్ ని (సెల్: 8712660655) లేదా కార్యాలయ అసిస్టెంట్‌ను (9848063345) సంప్రదించవచ్చు.

ఈ శిబిరానికి వచ్చే చిన్నారులకు రవాణా సౌకర్యాన్ని (Transportation) తల్లిదండ్రులే స్వయంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పోలీసులకు, ప్రజలకు మధ్య దూరాన్ని తగ్గించి, ఫ్రెండ్లీ పోలీసింగ్ వాతావరణాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More