...
...
Next Story

Hyderabad Police : సత్ఫలితాలిస్తోన్న 'సీ-మిత్ర' - 100కిపైగా ఎఫ్ఐఆర్‌ల నమోదు

హైదరాబాద్ పోలీసులు తీసుకువచ్చిన 'సీ-మిత్ర' సత్ఫలితాలిస్తోంది. పది రోజుల్లోనే 1000 మంది బాధితులకు ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఇప్పటివరకు 100 ఎఫ్ఐఆర్‌ల నమోదయ్యాయి.

Published on: Jan 21, 2026, 05:10:40 IST
Advertisement

సైబర్ నేర బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు హైదరాబాద్ పోలీసులు చేపట్టిన వినూత్న కార్యక్రమం 'సీ-మిత్ర' సత్పలితాలను ఇస్తోంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చేపట్టిన ఈ విధానం.. అమల్లోకి వచ్చిన కేవలం పది రోజుల్లోనే వందల మందికి భరోసానిచ్చింది.

100కిపైగా ఎఫ్ఐఆర్ లు….

సత్ఫలితాలిస్తోన్న 'సీ-మిత్ర'
సత్ఫలితాలిస్తోన్న 'సీ-మిత్ర'

ఈ స్వల్ప వ్యవధిలో సీ-మిత్ర బృందం 1000 మంది బాధితులకు స్వయంగా ఫోన్ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంది. రోజుకు సగటున 100 ఫోన్ కాల్స్ చేస్తున్నారు. బాధితుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో 200 మందికి పక్కాగా ఫిర్యాదు డ్రాఫ్ట్‌లను సిద్ధం చేసి పంపింది. వారి నుంచి సంతకం చేసిన ప్రతులు అందగానే.. ఎక్కడా జాప్యం లేకుండా 100 కిపైగా ఎఫ్ఐఆర్ లను నమోదు చేశారు. గంటల తరబడి స్టేషన్లలో పనిలేకుండా…. నిమిషాల్లోనే వర్చువల్ పోలీసులు స్పందిస్తుండటం, ఎఫ్ఐఆర్ కాపీలు నేరుగా మొబైల్‌కే వస్తుండటంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇంటి నుంచే ఫిర్యాదు..

సైబర్ నేర బాధితులు 1930 నంబరుకు లేదా జాతీయ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. ఆ వెంటనే 'సీ-మిత్ర' బృందం రంగంలోకి దిగుతుంది. బాధితులకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీసి, ఏఐ సాంకేతికతతో లీగల్ అంశాలతో కూడిన పక్కా ఫిర్యాదు డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసి వాట్సాప్ లేదా మెయిల్‌కు పంపిస్తారు. బాధితులు ఆ ఫిర్యాదును ప్రింట్ తీసుకొని, సంతకం చేసి బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ స్టేషన్‌కు కొరియర్ లేదా పోస్ట్ ద్వారా పంపాలి. ఆ కాపీ అందగానే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆ వివరాలను బాధితుల మొబైల్‌కే మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ నేర బాధితులకు ఇబ్బందులు కలగకుండా సత్వర న్యాయం అందించాలనే ఉద్దేశంతో వినూత్న కార్యక్రమం సీ-మిత్రను జనవరి 9వ తేదిన నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రారంభించారు.

పోలీసులా కాదు.. ఒక సోదరిలా - దీక్షిత, మహిళా కానిస్టేబుల్

“సాధారణంగా మోసపోయామన్న బాధలో ఉన్నవారు పోలీస్ స్టేషన్‌కు రావాలంటేనే భయపడతారు. కానీ, మేమే స్వయంగా ఫోన్ చేసి.. 'భయపడకండి, మీకు న్యాయం చేయడానికి మేమున్నాం' అని చెప్పగానే వారి గొంతులో కనిపించే ధైర్యం వెలకట్టలేనిది. ఒకప్పుడు స్టేషన్ కు రావాలంటే ఆలోచించే సామాన్యుడికి, పోలీసులకు మధ్య 'సీ-మిత్ర' ఒక బలమైన వారధిలా నిలిచింది. నేను ప్రతి రోజు 20 మంది బాధితులకు ఫోన్ చేస్తా. ఒక సోదరిలా వారి సమస్యను విని, ఇంటి నుంచే ఫిర్యాదు తీసుకుంటున్నప్పుడు బాధితులు చూపిస్తున్న కృతజ్ఞత మా బాధ్యతను మరింత పెంచుతోంది” అని మహిళా కానిస్టేబుల్ దీక్షిత వివరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks