హైదరాబాద్‌లో 2025లో షీ టీమ్స్ 1,149 ఫిర్యాదులను పరిష్కరించింది. వివిధ రకాల వేధింపులకు పాల్పడిన 3,826 మందిని అరెస్టు చేసినట్టుగా హైదరాబాద్ పోలీసులు తెలిపారు. డిజిటల్ బ్లాక్‌మెయిల్, సైబర్‌స్టాకింగ్, పబ్లిక్ ప్లేస్‌లో వేధింపులు వంటి నేరాలపై షీ టిమ్స్ స్పెషల్ ఫోకస్ చేసింది. ప్రతి ఫిర్యాదును తీవ్రత, గోప్యతతో పరిశీలిస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ అన్నారు.

పోలీసుల ప్రకారం, బ్లాక్‌మెయిల్ అత్యంత సాధారణ సైబర్ సంబంధిత నేరంగా ఉంది. ప్రైవేట్ ఛాయాచిత్రాలను లేదా రికార్డ్ చేసిన వీడియో కాల్‌లను దుర్వినియోగం చేస్తామని చాలా బెదిరిస్తున్నారు. నీ ప్రైవేట్ వీడియోలు నా దగ్గర ఉన్నాయి. నీతో దిగిన మీ ఫొటోలను మీ ఇంట్లో వాళ్లకు పంపిస్తాను అంటూ బెదిరించిన తర్వాత 366 మంది బాధితులు షీ టీమ్స్‌ను సంప్రదించారు.
బ్లాక్‌మెయిలింగ్ సమస్య నిజానిగి ఎక్కువగా ఉంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా పరిచయం అవుతారు. నమ్మించి చనువు పెంచుకుంటారు. ఆ తర్వాత వీడియో కాల్స్, పర్సనల్ ఫొటోలతో ఆట మెుదలుపెడతారు. ఇక కొంతమంది ఎక్స్ లవర్స్ కూడా పాత ఫొటోలను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాతో మాట్లాడకపోయినా.. వేరే పెళ్లి చేసుకున్నా.. పాత ఫొటోలను బయటపెడతా అంటూ బెదిరించినవారు ఉన్నారు. ఇలాంటి బ్లాక్ మెయిలింగ్‌కు సంబంధించి 366 కేసులు నమోదు అయ్యాయి.
ఇంటర్నెట్ కాల్స్ ద్వారా అర్ధరాత్రి వేధింపులకు సంబంధించిన 121 కేసులు, ఫేక్ ప్రొఫైల్స్, అశ్లీల కంటెంట్ ప్రసరణకు సంబంధించిన 82 కేసులను కూడా ఉన్నాయి. ఈ కేసుల్లో కొన్ని సందర్భాల్లో గుర్తించలేని నంబర్‌లు, ఆన్‌లైన్ ఖాతాలను గుర్తించడానికి ఫోరెన్సిక్, సాంకేతిక విశ్లేషణను ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు.
వివాహం పేరుతో మహిళలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించిన 98 కేసులను షీ టీమ్స్ పరిష్కరించింది. ప్రేమ పేరుతో వల వేస్తున్నారు. పెళ్లి అనగానే ముఖం చాటేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో అమ్మాయిలను నమ్మించి శారీరంగా, ఆర్థికంగా ఉపయోగించుకుంటున్నారు. షీ టీమ్స్ బాధితులకు కౌన్సెలింగ్ ఇవ్వడమే కాదు.. నిందితులపై క్రిమినల్ చర్యలు తీసుకుంది.
{{/usCountry}}వివాహం పేరుతో మహిళలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించిన 98 కేసులను షీ టీమ్స్ పరిష్కరించింది. ప్రేమ పేరుతో వల వేస్తున్నారు. పెళ్లి అనగానే ముఖం చాటేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో అమ్మాయిలను నమ్మించి శారీరంగా, ఆర్థికంగా ఉపయోగించుకుంటున్నారు. షీ టీమ్స్ బాధితులకు కౌన్సెలింగ్ ఇవ్వడమే కాదు.. నిందితులపై క్రిమినల్ చర్యలు తీసుకుంది.
{{/usCountry}}సాధారణ దుస్తుల్లో ఉంటూ షీ టీమ్స్ బస్ స్టేషన్లు, కళాశాలలు, ఇతర రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలోనూ నిఘా పెడతాయి. పట్టుబడిన వారిలో ఎక్కువ మందికి వారి కుటుంబ సభ్యులతో పాటు కౌన్సెలింగ్ ఇచ్చారు అధికారులు. ఇక తీవ్రమైన కేసుల్లో అరెస్టులు, రియు జ్యుడీషియల్ కస్టడీలు ఉన్నాయి.
మహిళలు ఎలాంటి వేధింపులను అయినా భయం లేకుండా ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర నంబర్ 100ను సంప్రదించవచ్చు లేదా వాట్సాప్ నెంబర్ 9490616555 ద్వారా షీ టీమ్స్‌ను సంప్రదించవచ్చని పోలీసులు తెలిపారు.