హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(H-CITI) ప్రాజెక్ట్ కింద జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, ముగ్ధ జంక్షన్ వద్ద జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఈరోజు(శుక్రవారం)నుంచి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ పోలీసు కమిషనర్ తెలిపారు. ఈ దారుల్లో వెళ్లేవారు ఆంక్షలు, మళ్లింపులు పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 2లో స్తంభాల నిర్మాణ పనులు శుక్రవారం (ఫిబ్రవరి 27, 2026) నుండి ప్రారంభమయ్యాయి. ముగ్ధ జంక్షన్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ (గేట్-I), జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మధ్య ట్రాఫిక్ రద్దీ ఉంటుందని భావిస్తున్నారు.
మళ్లింపు ఇలా..
NFCL నుండి శ్రీనగర్ కాలనీ టీజంక్షన్, సాగర్ సొసైటీ, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నంబర్ 36, 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు ప్రయాణించే వాహనదారులను శ్రీనగర్ కాలనీ టీ జంక్షన్, సాగర్ సొసైటీ వద్ద మళ్లిస్తారు. శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్డు, ఇందిరానగర్ లేబర్ అడ్డా, రోడ్ నంబర్ 5 జూబ్లీహిల్స్, వెంకటగిరి ఎక్స్ రోడ్ల ద్వారా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ చేరుకునే ముందు దారి మళ్లిస్తారు.
జూబ్లీహిల్స్‌లోని 36, 45 రోడ్ నంబర్ల నుండి NFCL వైపు వెళ్లే వాహనాలను జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద వెంకటగిరి రోడ్ నంబర్ 2, యూసుఫ్‌గూడ బస్తీ, యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్, మైత్రివనం, అమీర్‌పేట, ఇందిరానగర్ లేబర్ అడ్డా, శ్రీనగర్ కాలనీ మీదుగా పంజాగుట్ట ప్రధాన రహదారి వైపు మళ్లిస్తారు.
కేసీపీ గెస్ట్ హౌస్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 నుంచి కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు ప్రయాణించే ప్రయాణికులు క్యాన్సర్ హాస్పిటల్ వైపు రోడ్డు నంబర్ 10 తీసుకొని, అగ్రసేన్ ఐలాండ్ వద్ద ఎడమవైపుకు తిరిగి భారతీయ విద్యా భవన్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45వైపు వెళ్లవచ్చు.
అదేవిధంగా మాసాబ్ ట్యాంక్ నుండి కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వచ్చే వారు విరించి హాస్పిటల్ సమీపంలోని 1/12 వద్ద ఎడమవైపుకు వెళ్లి అగ్రసేన్ ఐలాండ్ మీదుగా రోడ్డు నంబర్ 45 వైపు కొనసాగాలి.
{{/usCountry}}అదేవిధంగా మాసాబ్ ట్యాంక్ నుండి కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వచ్చే వారు విరించి హాస్పిటల్ సమీపంలోని 1/12 వద్ద ఎడమవైపుకు వెళ్లి అగ్రసేన్ ఐలాండ్ మీదుగా రోడ్డు నంబర్ 45 వైపు కొనసాగాలి.
{{/usCountry}}అవసరమైతే మాత్రమే ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తామని పోలీసులు తెలిపారు. ఉదయం 8.30 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల మధ్య రద్దీ సమయాల్లో ఈ రూట్లలో ప్రయాణం చేయకుండా చూడాలని అధికారుు తెలిపారు. రియల్-టైమ్ అప్డేట్స్ కోసం నావిగేషన్ అప్లికేషన్‌లను ఉపయోగించండి. రద్దీ సమయాల్లో భారీ వాహనాలు ఈ రూట్లలోకి తీసుకురావొద్దు.
పోలీసులు పౌరులకు సహకరించాలని, అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అప్డేట్స్ ఫాలో కావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో, ప్రయాణికులు సహాయం కోసం 9010203626లో ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.