రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు అక్టోబర్ 2, 3 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఏకంగా 380 మంది వాహనదారులు పట్టుబడ్డారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా, ఇతర ప్రయాణికులకు కూడా ముప్పుగా మారుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
వాహనాల వారీగా వివరాలు:

ఈ ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడిన మొత్తం 380 మందిలో 343 మంది ద్విచక్ర వాహనదారులు కాగా, 12 మంది ఆటో రిక్షాల డ్రైవర్లు, 25 మంది నాలుగు చక్రాల వాహనాలు తదితర వాహనాలను నడుపుతున్నవారు ఉన్నారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం…. పట్టుబడిన వారి శరీరంలో రక్తపు మద్యపాన సాంద్రత (BAC) స్థాయిలు అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది:
- 30 నుండి 50 మధ్యలో BAC నమోదైన కేసులు : 80
- 51 నుండి 100 రేంజ్ లో ఉన్న కేసులు: 167
- 101 నుండి 150 range లో ఉన్న కేసులు: 77
- 151 నుండి 200 రేంజ్ లో ఉన్న కేసులు: 39
- 201 నుండి 250 రేంజ్ లో ఉన్న కేసులు: 12
- 251 నుండి 300 రేంజ్ లో ఉన్న కేసులు: 2
- 300 కి పైగా తీవ్రమైన BAC నమోదుతో పట్టుబడిన కేసులు: 3
మద్యం తాగి వాహనం నడిపే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తే లేదని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కూడా ఈ తరహా ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని, నగరవాసులు పోలీసుల తనిఖీలకు సహకరించాలని కోరారు.
ఇదిలా ఉండగా….. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్ - ఫారినర్స్ మానిటరింగ్ సెల్, ఎఫ్ఆర్ఆర్ఓ (FRRO), స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులు మరియు ఐటీ సెల్ కలిసి సంయుక్తంగా చేపడుతున్న మరో ప్రత్యేక ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. వీసా నిబంధనలు ఉల్లంఘించి, చట్టవిరుద్ధంగా భారత్లో కాలపరిమితి ముగిసినా ఉంటున్న విదేశీ జాతీయుల గుర్తింపుపై నగర పోలీసులు గట్టి నిఘా ఉంచారు.
{{/usCountry}}ఇదిలా ఉండగా….. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్ - ఫారినర్స్ మానిటరింగ్ సెల్, ఎఫ్ఆర్ఆర్ఓ (FRRO), స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులు మరియు ఐటీ సెల్ కలిసి సంయుక్తంగా చేపడుతున్న మరో ప్రత్యేక ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. వీసా నిబంధనలు ఉల్లంఘించి, చట్టవిరుద్ధంగా భారత్లో కాలపరిమితి ముగిసినా ఉంటున్న విదేశీ జాతీయుల గుర్తింపుపై నగర పోలీసులు గట్టి నిఘా ఉంచారు.
{{/usCountry}}ఆగస్టు 31 నుండి నిర్వహిస్తున్న ఈ ఉమ్మడి తనిఖీల ద్వారా ఇప్పటివరకు వీసా నిబంధనలు ఉల్లంఘించిన 49 మంది విదేశీయులను అధికారులు గుర్తించారు. వీరిని ప్రత్యేక హోల్డింగ్ సెంటర్లకు తరలించారు. వీరిలో 12 మంది విదేశీ జాతీయులను ఇప్పటికే వారి స్వదేశాలకు పంపించివేశారు (డీపోర్టేషన్). మిగిలిన వారిని కూడా వారి దేశాలకు పంపించే ప్రక్రియ సంబంధిత అధికారుల సమన్వయంతో వేగంగా జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.