...
...
Next Story

AI Police Station : FIR నుంచి ఛార్జ్ షీట్ వరకు... దేశంలోనే తొలి ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట - డిసెంబర్‌లో ప్రారంభం

Panjagutta AI Police Station : హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను దేశంలోనే తొలి ఏఐ ఆధారిత స్టేషన్‌గా తీర్చిదిద్దుతున్నట్లు సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు నుంచి ఛార్జ్ షీట్ వరకు ఏఐ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Published on: Nov 12, 2026, 13:43:25 IST
Advertisement

దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పోలీస్ స్టేషన్‌గా హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ రూపుదిద్దుకుంటోంది. డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ స్టేషన్‌లోని అన్ని సేవలను అత్యాధునిక ఏఐ సాంకేతికతతో అనుసంధానం చేస్తున్నారు.

ఏఐ పోలీస్ స్టేషన్‌ (Gemini AI Image )
ఏఐ పోలీస్ స్టేషన్‌ (Gemini AI Image )

ఇందులో భాగంగా బుధవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముఖ్యమైన వివరాలను వెల్లడించారు. తనిఖీలో భాగంగా స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో సజ్జనార్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్‌లోని ప్రతి సిబ్బంది పనితీరు, వారు నిర్వహిస్తున్న విధులపై ఆరా తీశారు. ఏసీపీ మురళీకృష్ణ, ఇన్‌స్పెక్టర్ జహంగీర్‌లతో కలిసి స్టేషన్‌లో సిద్ధమవుతున్న ఏఐ సాంకేతిక ఏర్పాట్లను సీపీ స్వయంగా పరిశీలించారు.

డిసెంబర్ లో ప్రారంభం…

డిసెంబర్ మొదటి వారంలో డీజీపీ చేతుల మీదుగా ఈ ఏఐ పోలీస్ స్టేషన్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభిస్తామని సజ్జనార్ తెలిపారు. ఇక్కడ వచ్చే ఫలితాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ విధానాన్ని అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

స్టేషన్ రిసెప్షన్ వద్ద ఇప్పటికే ఏర్పాటు చేసిన 'సేతు' (Sethu) కియోస్క్ ద్వారా బాధితులు దాదాపు 10 భాషల్లో తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని సీపీ వివరించారు. బాధితులు ఏ భాషలో ఫిర్యాదు చేసినా, ఏఐ సాంకేతికత దానిని క్షణాల్లో స్థానిక భాషలోకి అనువదించి సంబంధిత అధికారులకు చేరవేస్తుందని పేర్కొన్నారు.

ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జిషీట్ వరకు….

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks