పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ(iBomma) నిర్వహించిన ఇమంది రవికి సంబంధించిన వ్యవహారంలో మరోసారి తెరపైకి వచ్చింది. తన బ్యాంక్ ఖాతాల్లో ఫ్రీజ్ (సీజ్) చేసిన దాదాపు రూ. 3 కోట్లను విడుదల చేయాలంటూ ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. ఖాతాలు స్తంభించిపోవడం వల్ల కుటుంబ పోషణ తీవ్ర భారంగా మారిందని, రోజువారీ అవసరాలకు సైతం ఇబ్బందులు పడుతున్నానని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

ఈ పిటిషన్‌పై నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టింది. భారతదేశంలోనే అత్యంత భారీ ఆన్‌లైన్ పైరసీ నెట్‌వర్క్‌పై విచారణలో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసులు రవికి చెందిన బ్యాంక్ ఖాతాలు, ఆస్తుల డిపాజిట్లను సీజ్ చేసిన సంగతి తెలిసిందే.
విశాఖపట్నం జిల్లాకు చెందిన 39 ఏళ్ల ఇమంది రవి (ఐబొమ్మ రవి) కరిబీయన్ దేశ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. నవంబర్ 2025లో ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయనను, కుకట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సైబర్ క్రైమ్ పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు.
నాంపల్లి కోర్టు బెయిల్ తిరస్కరించడంతో ఆయన దాదాపు 90 రోజులు చంచల్‌గూడ జైలులోనే గడిపాడు. ఫిబ్రవరి 17, 2026న కోర్టు కఠినమైన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఛార్జ్‌షీట్ దాఖలు చేసే వరకు రోజువారీగా విచారణాధికారి ముందు హాజరుకావాలని, పాస్‌పోర్ట్‌ను సమర్పించాలని, దేశం విడిచి వెళ్లకూడదని, ఎలాంటి పైరసీ సైట్లను నిర్వహించకూడదని కోర్టు ఆదేశించింది.
వెబ్ హోస్టింగ్, డెవలప్‌మెంట్‌లో మంచి అనుభవం ఉన్న రవి, 2019లో ఐబొమ్మ పోర్టల్‌ను ప్రారంభించాడు. కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో కొత్త సినిమాలను హెచ్‌డీ క్వాలిటీతో ఉచితంగా అందించడంతో ఈ సైట్‌కు విపరీతమైన ఆదరణ పెరిగింది. ఆ తర్వాత 2022లో బప్పం అనే మరో వెబ్‌సైట్‌ను కూడా స్టార్ట్ చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెట్వర్క్ నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ సర్వర్ల ఆధారంగా దాదాపు 65 కి పైగా మిర్రర్ వెబ్సైట్ల ద్వారా నడిచింది. రవి వద్ద లభించిన హార్డ్ డిస్కుల్లో వివిధ భాషలకు చెందిన 21 వేల సినిమాలు, 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా దొరికినట్లు అప్పటి పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ వెల్లడించారు.
{{/usCountry}}పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెట్వర్క్ నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ సర్వర్ల ఆధారంగా దాదాపు 65 కి పైగా మిర్రర్ వెబ్సైట్ల ద్వారా నడిచింది. రవి వద్ద లభించిన హార్డ్ డిస్కుల్లో వివిధ భాషలకు చెందిన 21 వేల సినిమాలు, 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా దొరికినట్లు అప్పటి పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ వెల్లడించారు.
{{/usCountry}}కేవలం పైరసీ మాత్రమే కాకుండా, ఈ సైట్లలో అక్రమ బెట్టింగ్ ప్రకటనలను ప్రదర్శించి వినియోగదారులను బెట్టింగ్ యాప్‌ల వైపు మళ్లించేవాడని విచారణలో తేలింది. ఈ ప్రక్రియలో కోట్లాది అక్రమ లావాదేవీలను పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఇతరుల పేర్లతో పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను తన కోసం ఉపయోగించినట్టుగా కూడా రవిపై ఆరోపణలు ఉన్నాయి.