...
...
Next Story

బీ కేర్‌ఫుల్! మీరు తినే ఐస్‌క్రీమ్ మంచిదేనా? ఇక్కడ తయారీ చూస్తే వాంతి వస్తుంది!

Ice Cream : హైదరాబాద్ ముషీరాబాద్‌లో అక్రమ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రం గుట్టు రట్టైంది. కల్తీ, గడువు తీరిన ఉత్పత్తులతో ఐస్‌క్రీమ్ తయారు చేస్తున్నారు.

Published on: Mar 26, 2026, 16:27:22 IST
Advertisement

Hyderabad Food Adulteration Surveillance Team(హెచ్-ఫాస్ట్) ముషీరాబాద్‌లో గడువు ముగిసిన ఐస్ క్రీమ్ విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసింది. హెచ్-ఫాస్ట్ అధికారులు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఆహార భద్రతా అధికారి బి.సాహితితో కలిసి బాపూజీ నగర్‌లోని బ్లూ బెల్స్ ఐస్ క్రీమ్ దుకాణంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై H-FAST దాడి
ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై H-FAST దాడి

చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా అపరిశుభ్రమైన పరిస్థితులలో దుకాణాన్ని నడపడం, గడువు ముగిసిన ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా వినియోగదారులకు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాన్ని కలిగించేలా చేస్తున్నందుకు యజమాని పట్టాల అశోక్‌ను అరెస్టు చేశారు. కల్తీ, అపరిశుభ్రమైన ఐస్ క్రీమ్ ఉత్పత్తులను భారీస్థాయిలో తయారు చేసి విక్రయిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఆ తయారీ చూస్తే వాంతి వచ్చేలాగా కనిపిస్తుంది.

కల్తీ ఉత్పత్తులను తయారు చేస్తూ.. మంచి క్వాలిటీ ఐస్ క్రీములని చెబుతూ.. వినియోగదారులకు విక్రయించి అక్రమ లాభాలు ఆర్జిస్తోంది బ్లూ బెల్స్ ఐస్ క్రీమ్ కంపెనీ. అధికారులు రూ. 1,75,000 విలువైన ఐస్ క్రీమ్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. దుకాణం నడుపుతున్న యజమానిని, స్వాధీనం చేసుకున్న సరుకును ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు.

ఈ తనిఖీలో ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంలో భారీ ఎత్తున నాణ్యత లేని ఐస్‌క్రీమ్ ఉత్పత్తులను తయారు చేసి పంపిణీ చేస్తున్నట్లు వెల్లడైంది. మామిడి, వెనీలా, అమెరికన్ నట్స్, బటర్‌స్కాచ్, డ్రై ఫ్రూట్, స్ట్రాబెర్రీ, క్రీమ్ అండ్ కుకీస్, ప్రత్యేక రుచులు, మలై కుల్ఫీ వంటి వివిధ రకాల ఐస్‌క్రీమ్‌లతో పాటు, చిన్న పెప్సీ ఐస్‌క్రీమ్ ప్యాకెట్లను కూడా వీరు తయారు చేస్తున్నారు. నాణ్యత విషయంలో తప్పుడు ప్రచారంతో ఈ ఉత్పత్తులను టోకు, చిల్లర మార్కెట్లకు సరఫరా చేస్తున్నారు.

ఈ ఆపరేషన్ H-FAST, స్థానిక పోలీసు సిబ్బంది సహకారంతో టాస్క్ ఫోర్స్ సీనియర్ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe