తెలంగాణకు IMD రెయిన్ అలర్ట్ - ఈనెల 23,24 తేదీల్లో వర్షాలు..! ఎల్లో హెచ్చరికలు
తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఈనెల 232, 24 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గిపోయింది. మరోవైపు ఎండలు పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణ వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు…
హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం…. ఈనెల 22వ తేదీన రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఈనెల 23వ తేదీన రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఈనెల 24వ తేదీన పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే సూచనలున్నాయి. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇక ఈనెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలో మళ్లీ పొడి వాతావరణమే ఉండే అవకాశం ఉంది. ఎలాంటి వర్ష సూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ఏపీకి వర్ష సూచన...
ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో ఏపీలో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే సూచనలున్నాయి. ఇక దక్షిణ కోస్తాలోరేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు.
ఇక రాయలసీమలో చూస్తే... ఇవాళ, రేపు ఎల్లుండి పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అయితే ఎల్లో, ఆరెంజ్, రెడ్ వంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

