అక్టోబర్లోను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బయటకు వెళ్తే ఉక్కపోతతో జనాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి, ఈశాన్య రుతుపవనాల కారణంగా రాబోయే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

కొన్ని చోట్ల ఈదురు గాలులతో పాటు కుండపోత వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. మన్నార్ గల్ఫ్, నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉన్న తుపాను వలయం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి విస్తరించి ఉందని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది. సోమవారం నుండి ఈశాన్య రుతుపవనాలు బలపడి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అక్టోబరు 15 గురువారం అల్లూరి, కాకినాడ, విశాఖపట్నం, మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కృష్ణా, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలోనూ ఈశాన్య రుతుపవనాల ప్రభావం కనిపించనుంది. ఈశాన్య రుతుపవనాల ప్రారంభానికి పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో గురువారం నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో వానలు పడనున్నాయి.
సుదీర్ఘకాలం పాటు మధ్యాహ్నాల్లో వేడి వాతావరణం కొనసాగిన తర్వాత ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతో రాబోయే రెండు రోజుల్లో అక్టోబర్ వేడి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. అక్టోబరు 17 నుంచి 19 వరకు కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్లో ఇటీవల ఉదయం పూట చల్లగా, మధ్యాహ్నం పూట వేడిగా ఉంటున్న వాతావరణం నుండి ఈ వాతావరణ సూచన ఉపశమనం కలిగిస్తోంది. ఉదయం చల్లగా ఉన్నప్పటికీ.. పగటి ఉష్ణోగ్రతలు అధికంగానే కొనసాగుతున్నాయి. ఉదయం 11 దాటితే బయటకు వెళ్తే.. ఎండాకాలం ఉన్నట్టుగా జనాలు ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతానికి వాతావరణం అకస్మాత్తుగా చల్లబడటానికి బదులుగా వేడి క్రమంగా తగ్గుతుందని వాతావరణ సూచనలు తెలియజేస్తున్నాయి.
{{/usCountry}}హైదరాబాద్లో ఇటీవల ఉదయం పూట చల్లగా, మధ్యాహ్నం పూట వేడిగా ఉంటున్న వాతావరణం నుండి ఈ వాతావరణ సూచన ఉపశమనం కలిగిస్తోంది. ఉదయం చల్లగా ఉన్నప్పటికీ.. పగటి ఉష్ణోగ్రతలు అధికంగానే కొనసాగుతున్నాయి. ఉదయం 11 దాటితే బయటకు వెళ్తే.. ఎండాకాలం ఉన్నట్టుగా జనాలు ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతానికి వాతావరణం అకస్మాత్తుగా చల్లబడటానికి బదులుగా వేడి క్రమంగా తగ్గుతుందని వాతావరణ సూచనలు తెలియజేస్తున్నాయి.
{{/usCountry}}