Telangana Weather Report : రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు…

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం… ఆగస్టు 18 మధ్యాహ్నం ఆగస్టు 20 ఉదయం 8:30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. దీనితో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు , ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుసే సూచనలున్నాయి.
ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ అయ్యాయి.
ఆగస్టు 20 ఉదయం 8:30 గంటల నుంచి ఆగస్టు 23 ఉదయం 8:30 గంటల వరకు… తేలికపాటి వర్షాలు పడొచ్చు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ఎలాంటి తీవ్రమైన వాతావరణ హెచ్చరికలు లేవని వాతావరణ శాఖ పేర్కొంది.
ప్రజలు, ముఖ్యంగా నిరంతరం ప్రయాణాలు చేసేవారు ,వ్యవసాయ పనుల్లో ఉండే రైతులు ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు. ఈదురు గాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
నగరంలో వర్షం….
ఇవాళ మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ సిటీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడిపోతున్న నగరవాసులకు ఉపశమనం కలిగిస్తూ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, బోరబండ, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, ఎస్ఆర్నగర్, సనత్‌నగర్, యూసఫ్‌గూడా, కృష్ణానగర్, మధురానగర్లతో పాటు లక్డీకాపూల్, ఖైరతాబాద్, మెహదీపట్నం ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అంతేకాకుండా ఎల్బీ నగర్, హయత్ నగర్, బీఎన్ నగర్ రెడ్డితో పాటు సిటీ శివారు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది.
{{/usCountry}}ఇవాళ మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ సిటీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడిపోతున్న నగరవాసులకు ఉపశమనం కలిగిస్తూ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, బోరబండ, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, ఎస్ఆర్నగర్, సనత్‌నగర్, యూసఫ్‌గూడా, కృష్ణానగర్, మధురానగర్లతో పాటు లక్డీకాపూల్, ఖైరతాబాద్, మెహదీపట్నం ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అంతేకాకుండా ఎల్బీ నగర్, హయత్ నగర్, బీఎన్ నగర్ రెడ్డితో పాటు సిటీ శివారు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది.
{{/usCountry}}వర్షం పడటంతో ఐటీ కారిడార్‌తో పాటు ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వర్షపు నీరు రోడ్లపై నిలవడంతో అమీర్‌పేట్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్లలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది.