Telangana Weather : మార్చి 2 నుంచి 7 వరకు తెలంగాణలో వేడిగాలులు వీచే అవకాశం

Telangana Weather Update : తెలంగాణలో మరికొన్ని రోజుల్లో వేడి గాలులు వీయనున్నాయి. ఇక వేసవి ప్రారంభం కానుంది.

Published on: Feb 25, 2026, 16:36:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో రెండు మూడు రోజుల నుంచి వాతావరణం చల్లగా ఉంటుంది. అకాల వర్షం కురిసింది. త్వరలో పొడి గాలులు వీచిన తర్వాత తెలంగాణలో వేసవి ప్రారంభమవుతుంది. తెలంగాణ వెదర్‌మ్యాన్‌ ప్రకారం, ఫిబ్రవరి 28 తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. తీవ్రమైన వేడి పరిస్థితులు ఏర్పడతాయి. అదే సమయంలో తర్వాత హైదరాబాద్ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ దాటవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మార్చి 2 నుంచి మార్చి 7 మధ్య ప్రధానంగా తెలంగాణలోని ఉత్తర, తూర్పు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటాయని, వేడిగాలుల హెచ్చరిక ఉంటుందని వెదర్ మ్యాన్ అంచనా వేశారు.

అయితే అంతకుముందు కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని చాలా ప్రాంతాలు పొడిగా ఉంటాయని అంచనా. హైదరాబాద్‌లో వాతావరణం చల్లగా ఉంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో మిశ్రమ వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఇతర ప్రాంతాల్లో వెచ్చని, తేమతో కూడిన పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది.

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన స్వల్పకాలిక జల్లులు పడే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం సహా పలు జిల్లాల్లో వర్షపాతం ఎక్కువగా ఉంటుందని అంచనా. ఈ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ప్రస్తుతం పంటలు కోసే దశలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో, వాతావరణ పరిస్థితులు స్థిరంగా ఉంటాయని, పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని భావిస్తున్నారు. ఉదయం వేళల్లో తేమ స్థాయిలు ఎక్కువగా ఉండవచ్చు.

హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, గణనీయమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం తక్కువగా ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. అయితే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో చినుకులు పడే అవకాశం కూడా ఉంది.

మరికొన్ని రోజులు హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్‌కు దగ్గరగా ఉండవచ్చు. వాతావరణ మార్పులు దృష్ట్యా ఆరోగ్య, భద్రతా సలహాలు కూడా జారీ చేశారు అధికారులు. ఈ రెండు మూడు రోజులు తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో చల్లటి గాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలలో కాలానుగుణ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. వాతావరణ పరిస్థితులు మారుతున్నందున అనారోగ్యం బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More