తెలంగాణను వణికిస్తున్న చలి - మరో 2 రోజులు తీవ్రమైన శీతల గాలులు..! ఎల్లో హెచ్చరికలు జారీ
రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. రోజంతా కూడా అదే పరిస్థితి ఉంటుంది. చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. సాయంత్రం 5 దాటితే పరిస్థితి ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి.
చలి తీవ్రతకు తెలంగాణ పల్లెలు వణికిపోతున్నాయి. పట్నం, పల్లె అనే తేడా లేకుండా… ఎక్కడైనా చలి పంజా విసురుతోంది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో… ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం పొగమంచు పరిస్థితులు ఉంటే…సాయంత్రం 5 దాటితే ఇంట్లో నుంచి బయటికి రావాలంటే జంకుతున్నారు.

ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ
హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం…రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణని పలుచోట్ల అక్కడక్కడ కనిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట,సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి గాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
డిసెంబర్ 13వ తేదీన ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి గాలులు వచే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
డిసెంబర్ 14వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగానూ పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ రోజు నుంచి ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.
హైదరాబాద్ వెదర్ రిపోర్ట్…
ఇక హైదరాబాద్ లో చూస్తే రాత్రి సమయంలో పొగమంచుతో కూడిన పరిస్థితులుంటాయి. రాబోయే 2 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు తక్కువగా ఉంటాయి. ఉపరితల గాలులు ఈశాన్య దిశలో వీచే అవకాశం ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

