...
...
Next Story

Weather Updates : అక్టోబర్ 5 నుంచి తెలంగాణలో మళ్లీ వర్షాలు - ఈ జిల్లాలకు IMD హెచ్చరికలు

Telangana Weather Updates : తెలంగాణ వ్యాప్తంగా అక్టోబరు 5 నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలున్నాయి.

Published on: Oct 3, 2026, 14:39:59 IST
Advertisement

Telangana Weather Updates : రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. అక్టోబరు 5వ తేదీ నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు మళ్లీ కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

ఈనెల 5 నుంచి వర్షాలు - ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణకు వర్ష సూచన

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లోని వివరాల ప్రకారం… అక్టోబరు 5 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడికక్కడ కురిసే అవకాశం ఉంది.

  • అక్టోబరు 3, 4 తేదీలు : రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఈ రెండు రోజులకు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేవు.
  • అక్టోబరు 5 : రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులు మరియు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ మేరకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
  • అక్టోబరు 6 : భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి.
  • అక్టోబరు 7, 8 తేదీలు : జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు విస్తరించే అవకాశం ఉంది.
  • అక్టోబరు 8 నుంచి 10 వరకు : రాష్ట్రంలో మళ్లీ పొడి వాతావరణం ఏర్పడుతుంది, ఎలాంటి హెచ్చరికలు లేవు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks