అకాల వర్షాల నేపత్యంలో ఏపీ, తెలంగాణలో వాతావరణం చల్లబడింది. ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వడగండ్ల వర్షాలు పడగా…. మరికొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు పడే సూచనలున్నాయి.

ఉత్తర అంతర కర్ణాటక నుంచి…. దక్షిణ అంతర కర్ణాటక మరియు అంతర తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగు రోజులపాటు వర్షాలు పడే సూచనలున్నాయి.
ఈ జిల్లాలకు హెచ్చరికలు:
తెలంగాణలోని చాలా జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇవాళ యాదాద్రి భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, మేడ్చల్-మల్కాజిగిరితో పాటు మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ పోస్ట్ లో పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, నల్గొండ, హన్మకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి, మెదక్, నాగర్‌కర్నూల్ మరియు వనపర్తి జిల్లాలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
“హైదరాబాద్ సిటీలో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో, ఈదురు గాలులతో (గంటకు 30-40 కి.మీ. వేగంతో) కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఉపరితల గాలులు ఆగ్నేయ దిశలో గంటకు 04-06 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది” అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఏపీకి వర్ష సూచన:
మరోవైపు ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ(మార్చి 18,2026) అల్లూరి, పోలవరం,నెల్లూరు,కడప,అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.
{{/usCountry}}మరోవైపు ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ(మార్చి 18,2026) అల్లూరి, పోలవరం,నెల్లూరు,కడప,అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.
{{/usCountry}}మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పిడుగుపాటుపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…. చెట్ల క్రింద నిలబడరాదని హెచ్చరించింది.