మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.
ఆపరేషన్ మాన్సూన్ థండర్ : అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు - నిందితుల్లో తెలంగాణ యువకుడు!
అమెరికాకు మత్తుమందులు సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టును ఎన్సీబీ, యూఎస్ డీఈఏ ఛేదించాయి. పట్టుబడిన ఆరుగురు నిందితుల్లో అమెరికా నుంచి బహిష్కరణకు గురైన తెలంగాణ బీటెక్ యువకుడితో పాటు ఎంబీఏ చదివిన వారు ఉండటం కలకలం రేపుతోంది.
భారత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA) సంయుక్తంగా ఇటీవల గుట్టురట్టు చేసిన అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అమెరికాకు నిషేధిత మత్తుమందులను అక్రమంగా రవాణా చేస్తున్న ఈ ముఠాలో అత్యున్నత విద్యావంతులు ఉండటం దర్యాప్తు అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది.

పట్టుబడిన ఆరుగురు భారతీయుల్లో బీటెక్, ఎంబీఏ డిగ్రీలు చేసిన వారు ఉండగా, వీరిలో ఒకరు గతంలోనే డ్రగ్స్ కేసులో అమెరికా నుంచి బహిష్కరణకు (డిపోర్ట్) గురైన తెలంగాణ యువకుడు ఉన్నాడు.
నవంబర్ 4 నుంచి 13వ తేదీ మధ్య దేశంలోని పలు నగరాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన అధికారులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసు దర్యాప్తు పరిధిని మరింత విస్తరించినట్లు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. నిందితుల అంతర్జాతీయ సంబంధాలు, అక్రమ లావాదేవీలపై లోతుగా విచారణ జరుపుతున్నారు.
నిందితుల్లో తెలంగాణ యువకుడు
ఈ ముఠాలో కీలక నిందితుడు టి. మనోజ్ తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడు. 27 ఏళ్ల మనోజ్ కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసి, ఉన్నత చదువుల (మాస్టర్స్ డిగ్రీ) కోసం అమెరికా వెళ్లాడు. అయితే అక్కడ నియంత్రిత మత్తుమందుల అక్రమ వ్యాపారం చేస్తూ పట్టుబడటంతో…. అమెరికా అధికారులు 2024 జనవరిలో మనోజ్‌ను భారత్‌కు తిప్పి పంపించారు. భారత్‌కు వచ్చిన తర్వాత కూడా మనోజ్ తన పాత పంథాను వీడలేదు. అమెరికా, భారత్‌లలో మనోజ్‌కు ఉన్న పరిచయాలు, నెట్‌వర్క్‌పై దర్యాప్తు బృందాలు ఆరా తీస్తున్నాయి.
- టి.డి. జైస్వాల్ (30) : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన ఇతను ఎంబీఏ పట్టభద్రుడు. లక్నోలో ఒక ఫార్మసీ (మందుల దుకాణం), బట్టల దుకాణంతో ఇతనికి వ్యాపార సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
- ఆర్తి సోని (32) : లక్నోకు చెందిన ఆర్తి మ్యాథమెటిక్స్ గ్రాడ్యుయేట్. గతంలో కార్పొరేట్ ఈవెంట్ మేనేజ్మెంట్ రంగంలో పనిచేసింది.
- ఎ. ముత్తలిబ్ (28) : కోల్‌కతాకు చెందిన ఇతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. వస్త్ర తయారీ, డెయిరీ వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు.
- డి.కె. తివారీ (39) : ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ అయిన ఇతనికి, ప్రధాన నిందితుడు జైస్వాల్‌తో వ్యాపార భాగస్వామ్యం ఉంది.
- జస్వంత్ (29) : లక్నోకు చెందిన ఇతను ఇంటర్మీడియట్ (12వ తరగతి) వరకు చదువుకుని ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు.
ఆపరేషన్ 'మాన్సూన్ థండర్'..
భారత్ నుంచి అమెరికాలోని వినియోగదారులకు జానాక్స్ (అల్ప్రజోలం), అటివాన్, ట్రామడోల్, వాలియం (డయాజెపామ్), యాంబియన్ వంటి ప్రమాదకరమైన ఓపియాయిడ్ మత్తుమందులను ఈ ముఠా అక్రమంగా పంపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఎన్సీబీ, యూఎస్ డీఈఏ సంయుక్తంగా 'మాన్సూన్ థండర్' (Monsoon Thunder) పేరుతో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఈ ముఠా గుట్టు రట్టయింది.
2022 జూన్ నుంచి 2026 నవంబర్ మధ్య కాలంలో ఈ ముఠా దాదాపు 3,000 పార్శిల్స్ ద్వారా సుమారు ఐదు లక్షల మత్తు మాత్రలను అమెరికా అంతటా సరఫరా చేసినట్లు డిజిటల్ ఆధారాలు, రికార్డుల ద్వారా తేలిందని ఎన్సీబీ నవంబర్ 20న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా, 59,000 మందికి పైగా కస్టమర్ల డేటాబేస్‌ను ఎన్సీబీ అధికారులు అమెరికా డీఈఏకు అందజేశారు. ఇందులో లావాదేవీల వివరాలు, గతంలో పంపిన పార్శిల్స్ సమాచారం, డెలివరీ చిరునామాలు, యూఎస్ పోస్టల్ సర్వీస్ ట్రాకింగ్ ఐడీలు, డ్రగ్స్ రకాలు ఉన్నాయి. అమెరికాలో ఉన్న కస్టమర్లు, డ్రాప్-షిప్పర్లను పట్టుకోవడానికి ఈ సమాచారం కీలకం కానుంది.
టెలిగ్రామ్‌లో ఆర్డర్లు.. క్రిప్టోలో చెల్లింపులు
నిందితులు అత్యంత తెలివిగా సాంకేతికతను వాడుకున్నారు. భారత్‌లో ఉంటూనే టెలిగ్రామ్, స్కైప్, వాట్సాప్ వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అమెరికా కస్టమర్ల నుంచి డ్రగ్స్ ఆర్డర్లు తీసుకునేవారు. అమెరికాలో ఉన్న తమ నెట్వర్క్ ద్వారా యూఎస్ పోస్టల్ సర్వీస్, ఇతర కొరియర్ మార్గాల్లో వాటిని డెలివరీ చేసేవారు. డబ్బుల చెల్లింపుల కోసం అమెరికా పేమెంట్ యాప్ 'వెన్మో' (Venmo), ఇతరుల పేర్లపై ఉన్న బ్యాంక్ ఖాతాలు, యూపీఐ (UPI), క్రిప్టోకరెన్సీని ఉపయోగించినట్లు ఎన్సీబీ గుర్తించింది.

E-Paper
