ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కార్యకలాపాలను వేగంగా సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు చూస్తోంది. ఇండిగో ఇప్పటివరకు మొత్తం రూ.610 కోట్ల రీఫండ్‌లను ప్రాసెస్ చేసిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రభుత్వం విమానయాన సంస్థకు కఠినమైన ఆదేశాలు జారీ చేసిందని పేర్కొంది.

ఫ్లైట్స్ రద్దుల వల్ల ప్రభావితమైన ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేయడానికి అదనపు రుసుములు అనుమతించరని అధికారిక ప్రకటన తెలిపింది. రీఫండ్, రీబుకింగ్ సమస్యలు, ఆలస్యం లేదా అసౌకర్యం లేకుండా పరిష్కరించేందుకు, ప్రయాణికులకు ముందస్తుగా సహాయం చేయడానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇండిగో పనితీరులో మెరుగుదల కనిపించిందని, విమాన షెడ్యూల్‌లు సాధారణ స్థాయికి తిరిగి వస్తున్నాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఇండిగో విమాన కార్యకలాపాలు శుక్రవారం 706 నుండి శనివారం 1,565కి పెరిగాయని, ఆదివారం నాటికి 1,650కి పెరిగాయని సీఈవో పీటర్ ఎల్బర్స్ వెల్లడించారు. ఇండిగో టీమ్ క్రమంగా సేవలను పునరుద్ధరిస్తోందని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు పని చేస్తోందని చెప్పారు. కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తున్నాయన్నారు. పైలట్ల కొరత, షెడ్యూల్ అంతరాయలతో ఇండిగో సమస్యలు ఎదుర్కొన్నది.
అన్ని ఇతర దేశీయ విమానయాన సంస్థలు సజావుగా, పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవలి విమానాలు క్యాన్సిల్ కారణంగా విమాన ఛార్జీలలో తాత్కాలిక పెరుగుదల గురించి కూడా చర్చించింది. ప్రభుత్వం జోక్యం చేసుకుని తక్షణమే అమలులోకి వచ్చేలా విమాన ఛార్జీలపై పరిమితిని ప్రవేశపెట్టిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, గోవా నుండి విమానాశ్రయ డైరెక్టర్లు ఆదివారం టెర్మినల్స్ అంతటా సాధారణ పరిస్థితుల గురించి చెప్పారు. చెక్-ఇన్, సేఫ్టీ లేదా బోర్డింగ్ పాయింట్ల వద్ద రద్దీ లేకుండా ప్రయాణికుల కదలిక సజావుగా సాగిందన్నారు.
{{/usCountry}}ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, గోవా నుండి విమానాశ్రయ డైరెక్టర్లు ఆదివారం టెర్మినల్స్ అంతటా సాధారణ పరిస్థితుల గురించి చెప్పారు. చెక్-ఇన్, సేఫ్టీ లేదా బోర్డింగ్ పాయింట్ల వద్ద రద్దీ లేకుండా ప్రయాణికుల కదలిక సజావుగా సాగిందన్నారు.
{{/usCountry}}ఇండిగో సంక్షోభం వల్ల ఏర్పడిన అంతరాయాన్ని పరిష్కరించడానికి, ప్రయాణికులు నిరంతరం అసౌకర్యాన్ని ఎదుర్కోకుండా చూసుకోవడానికి వేగవంతమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా విమాన ప్రయాణ కార్యకలాపాలు వేగంగా సాధారణ స్థితికి వస్తున్నాయని వెల్లడించింది.
ఇండిగో దేశవ్యాప్తంగా 3 వేలకుపైగా ప్రయాణికుల బ్యాగులను డెలివరీ చేసింది. 'ప్రయాణికుల లగేజీని తిరిగి వారికి అందజేసేందు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. దీనితోపాటుగా ఇండిగో ఇప్పటివరకు రూ.610 కోట్లకుపైగా రీఫండ్స్ చేసింది. విమానాల రద్దు, ఆలస్యం తర్వాత ఈ మెుత్తాన్ని ప్రయాణికులకు చెల్లించాలి. విమానయాన సంస్థ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తుంది.' అని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.