మీ ఇండిగో ఫ్లైట్ రద్దు అయ్యిందా? ఇలా రీఫండ్ పొందండి..
ఇండిగో సంక్షోభంలో మీరు కూడా బాధితులుగా మిగిలిపోయారా? మీ ఫ్లైట్ కూడా రద్దు అయ్యింది? రీఫండ్ పొందడం ఎలా? అని ఆలోచిస్తున్నారు? ఇండిగో ఫ్లైట్ రీఫండ్‌ని ఇలా, సింపుల్ స్టెప్స్‌లో పొందండి..
భారత్‌లో పైలట్‌ల పని గంటలపై కొత్తగా, కఠినంగా రూపొందించిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్డీటీఎల్) నిబంధనల కారణంగా ఇండిగో ఉక్కిరిబిక్కిరి అయిన విషయం తెలిసిందే. ఈ వారం మొత్తం మీద సంస్థకు చెందిన అనేక విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. దీనితో చాలా మంది ప్రయాణికులు తమ నిర్ణీత విమానాలను ఎక్కలేకపోయారు. దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో అనేక మంది ప్రయాణికులు గంటల తరబడి చిక్కుకుపోయి, తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మీరు మీ టికెట్‌ను ముందుగానే బుక్ చేసుకుని, మీ విమానం రద్దు అయ్యుంటే, మీరు చెల్లించిన టికెట్ డబ్బును వెనక్కి (రీఫండ్) పొందవచ్చు, లేదా తదుపరి అందుబాటులో ఉన్న విమానాన్ని ఎంచుకోవచ్చు. మీ రీఫండ్‌ను ఆలస్యం లేకుండా క్లెయిమ్ చేసుకోవడానికి సులభమైన ప్రక్రియను ఇక్కడ తెలుసుకోండి..
రద్దయిన ఇండిగో విమాన టికెట్‌కు రీఫండ్ కోసం..
1. మీ విమానం స్టేటస్‌ను తనిఖీ చేయండి
మీ విమానం నిజంగా రద్దయిందా, లేదా అని మొదట నిర్ధారించుకోండి.
ఇండిగో వెబ్‌సైట్‌ను సందర్శించండి లేదా మొబైల్ యాప్‌ను తెరవండి.
మేనేజ్ బుకింగ్ విభాగానికి వెళ్లండి.
మీ పీఎన్‌ఆర్ లేదా బుకింగ్ రిఫరెన్స్ నంబర్, చివరి పేరును నమోదు చేయండి.
మీ విమానం కరెంట్ స్టేటస్‌ని ధృవీకరించుకోండి.
2. మీకు నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకోండి
రద్దయిన విమానాలకు సంబంధించి ఇండిగో రెండు ప్రత్యామ్నాయాలను అందిస్తుంది:
మీ టికెట్ మొత్తాన్ని పూర్తిగా రీఫండ్ పొందడం.
తదుపరి అందుబాటులో ఉన్న విమానంలో ఉచితంగా తిరిగి బుక్ చేసుకోవడం.
మీ ప్రయాణ ప్రణాళికలకు ఏది సరిపోతుందో చూసుకుని ఆ ఆప్షన్ని ఎంచుకోండి.
3. రీఫండ్ అభ్యర్థనను సమర్పించండి
మీరు రీఫండ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే:
ఇండిగో ఆన్‌లైన్ రీఫండ్స్ పేజీని సందర్శించండి.
రద్దయిన విమానం కోసం రద్దు/రీఫండ్‌ను ఎంచుకోండి.
మీ పీఎన్‌ఆర్, ఈమెయిల్ ఐడీ, ప్రయాణికుల వివరాలను నమోదు చేయండి.
రీఫండ్ ప్రక్రియను ప్రారంభించడానికి ఫారమ్‌ను సమర్పించండి.
4. ఆన్‌లైన్ చెల్లింపులకు రీఫండ్
మీరు డిజిటల్ పద్ధతిలో చెల్లింపు చేసి ఉంటే, ఇండిగో అదే పేమెంట్ సోర్స్ నుంచి మొత్తాన్ని తిరిగి జమ చేస్తుంది. ఈ ప్రక్రియ సాధారణంగా 5–7 పని దినాలు పడుతుంది.
5. నగదు చెల్లింపులకు రీఫండ్
మీరు మీ టికెట్‌ను నగదు రూపంలో కొనుగోలు చేసి ఉంటే:
మీరు బుకింగ్ చేసిన విమానాశ్రయం టికెట్ కౌంటర్‌ను సందర్శించండి.
ప్రక్రియను పూర్తి చేయడానికి మీ టికెట్, చెల్లుబాటు అయ్యే ఐడీని తీసుకెళ్లండి.
6. ఏజెంట్లు లేదా ట్రావెల్ పోర్టల్స్ ద్వారా బుకింగ్‌లు
మీరు థర్డ్-పార్టీ పోర్టల్ లేదా ట్రావెల్ ఏజెంట్ ద్వారా టికెట్‌ను బుక్ చేసుకుని ఉంటే, రీఫండ్ వారికి జారీ అవుతుంది. రీఫండ్ ఆలస్యమైతే మీ ఏజెంట్‌ను నేరుగా సంప్రదించండి.
7. మీ రీఫండ్‌ను ట్రాక్ చేయండి
మీ రీఫండ్ ప్రాసెస్ అయిన తర్వాత ఇండిగో ఒక ధృవీకరణ ఈమెయిల్ పంపుతుంది.
రీఫండ్ రావడానికి 7-10 పని దినాల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే, ఇండిగో సపోర్ట్ టీమ్‌ను వెబ్‌సైట్, యాప్ లేదా కాల్ సెంటర్ ద్వారా సంప్రదించండి.
ప్రయాణికుల హక్కులపై మరింత స్పష్టత కోసం మీరు డీజీసీఏ నిబంధనలను కూడా చూడవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


