...
...
Next Story

Indiramma Bheema Scheme : రాష్ట్ర అవతరణ దినోత్సవ కానుక - 1.15 కోట్ల కుటుంబాలకు ‘ఇందిరమ్మ బీమా’!

Indiramma Bheema Scheme Telangana : తెలంగాణలో అర్హులైన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా కల్పించే 'ఇందిరమ్మ బీమా' పథకం ప్రారంభం కానుంది. జూన్ 2న ఈ కొత్త స్కీమ్ ను ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.

Published on: May 25, 2026, 08:15:13 IST
Advertisement

Indiramma Bheema Scheme Telangana : జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ కానుకగా మరో భారీ సంక్షేమ పథకాన్ని అందించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. రాష్ట్రంలోని సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఉచిత జీవిత బీమా సౌకర్యం కల్పించే ‘ఇందిరమ్మ బీమా’ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం ఖమ్మంలో ఈ ప్రకటన చేశారు.

జూన్ 2 నుంచి 'ఇందిరమ్మ జీవిత భీమా',
జూన్ 2 నుంచి 'ఇందిరమ్మ జీవిత భీమా',

కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు ఈ పథకం ఒక రక్షణ కవచంలా మారుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. కులం, మతం లేదా ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ దీని ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను, విధివిధానాలను సేకరించేందుకు ప్రభుత్వ అధికారులు త్వరలోనే ప్రతి ఇంటిని సందర్శిస్తారన…., ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని…. నిరుపేదల ముంగిటకే సంక్షేమ ఫలాలను నేరుగా చేరవేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఈ బీమా వర్తింపజేయనున్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం…. తెలంగాణవ్యాప్తంగా ఉన్న దాదాపు 1.15 కోట్ల పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ నూతన పథకం ద్వారా గరిష్ట ఆర్థిక భద్రత చేకూరనుంది. కుటుంబంలో సంపాదించే ముఖ్య వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోకుండా…. ఈ ఐదు లక్షల రూపాయల బీమా సొమ్ము అండగా నిలుస్తుంది.

  • రూ.5 లక్షల ఉచిత బీమా : ఈ పథకంలో నమోదైన ఏ కుటుంబంలోనైనా దురదృష్టవశాత్తు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగి ప్రాణనష్టం సంభవిస్తే… ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం బీమా రూపంలో అందుతుంది.
  • ప్రీమియం భారం లేదు : సాధారణంగా జీవిత బీమా పాలసీలకు ప్రతి ఏటా వేల రూపాయల్లో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి అయ్యే పూర్తి ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
  • 1.15 కోట్ల కుటుంబాలకు లబ్ధి : రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో ఉండే పేద ప్రజల నుంచి పట్టణాల్లోని అణగారిన వర్గాల వరకు దాదాపు 1.15 కోట్ల కుటుంబాలకు ఒకేసారి ఈ స్కీమ్ వర్తింపజేసే అవకాశం ఉంది.
  • ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ, దరఖాస్తు విధానం క్లెయిమ్ చేసుకునే నిబంధనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే సిఫార్సుల ఆధారంగా ఈ స్కీమ్ పట్టాలెక్కనుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఈ స్కీమ్ ను ప్రారంభిస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe