TG Indiramma Bima Scheme : రూ.5 లక్షల ఉచిత బీమా కవరేజ్ - నవంబరు 19న ‘ఇందిరమ్మ బీమా’ స్కీమ్ ప్రారంభం
రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి నవంబరు 19న రూ.5 లక్షల బీమా పథకం ‘ఇందిరమ్మ బీమా’ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటన చేశారు.
పేద కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఉచిత జీవిత బీమా సౌకర్యం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయనుంది. అయితే ఈ స్కీమ్ కు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం వైద్య, సామాజిక భద్రత రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందన్నారు.

నవంబర్ 19న ప్రారంభం….
ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ఆదివారం నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ) ఆత్మీయ సమావేశంలో భట్టి మాట్లాడారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని దగ్గర చేశామన్నారు. దీనికి కొనసాగింపుగా…. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక రక్షణ కల్పించే ఉద్దేశంతో ప్రతిష్టాత్మక 'ఇందిరమ్మ బీమా' పథకాన్ని నవంబర్ 19న అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ బృహత్తర పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నిత్యం ఉచిత అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) అందిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. రాబోయే రెండేళ్ల వ్యవధిలోనే మధిర నియోజకవర్గ ముఖచిత్రాన్ని మారుస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలల ఆధునీకరణ, నాణ్యమైన రోడ్ల నిర్మాణం, ఆసుపత్రుల మౌలిక వసతుల కల్పన పనులన్నింటినీ శరవేగంగా పూర్తి చేసి మధిరను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ బీమా స్కీమ్ - ముఖ్య సమాచారం..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఈ బీమా వర్తింపజేయనున్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం…. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దాదాపు 1.15 కోట్ల పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ నూతన పథకం ద్వారా గరిష్ట ఆర్థిక భద్రత చేకూరనుంది.
- కుటుంబంలో సంపాదించే ముఖ్య వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోకుండా…. ఈ ఐదు లక్షల రూపాయల బీమా సొమ్ము అండగా నిలుస్తుంది.
- ఈ పథకంలో నమోదైన ఏ కుటుంబంలోనైనా దురదృష్టవశాత్తు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగి ప్రాణనష్టం సంభవిస్తే… ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం బీమా రూపంలో అందుతుంది.
- సాధారణంగా జీవిత బీమా పాలసీలకు ప్రతి ఏటా వేల రూపాయల్లో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి అయ్యే పూర్తి ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
- ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ, దరఖాస్తు విధానం క్లెయిమ్ చేసుకునే నిబంధనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు జారీ అవుతాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

