...
...
Next Story

ఐఆర్‌సీటీసీ మాన్‌సూన్ మ్యాజిక్ టూర్ డీటెయిల్స్.. హౌస్‌బోట్‌లో హాయిగా ప్రయాణం

IRCTC Tour : ఐర్‌సీటీసీ అద్భుతమైన టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. మరికొన్ని రోజుల్లో హైదరాబాద్ నుంచి కేరళం మాన్‌సూన్ మ్యాజిక్ టూర్‌ను ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

Published on: Jun 12, 2026, 09:57:05 IST
Advertisement

ఆకాశం నిండా నల్లటి మబ్బులు.. చిన్నగా కురిసే చిరుజల్లులు.. పచ్చటి తివాచీ పరిచినట్లుండే తేయాకు తోటలు.. ఉరకలెత్తే జలపాతాలు.. వర్షాకాలంలో ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ కేరళను సందర్శించడం ఒక మధురమైన అనుభూతి కదా. ప్రకృతి ప్రేమికుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రయాణ ప్యాకేజీ కేరళం మాన్‌సూన్ మ్యాజిక్ (Keralam Monsoon Magic) ను అందుబాటులోకి తెచ్చింది.హైదరాబాద్ నుంచే నేరుగా ప్రారంభవుతుంది.

ఐఆర్‌సీటీసీ కేరళం టూర్ ప్యాకేజీ
ఐఆర్‌సీటీసీ కేరళం టూర్ ప్యాకేజీ

6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీకి సంబంధించిన రోజువారీ షెడ్యూల్, ధరలు, ఇతర పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఆగస్టు 3వ తేదీన ఈ రూట్ ప్యాకేజీ ఉంది. కొచ్చి, కుమరకోమ్, మున్నార్, త్రివేండ్రం చూసి రావొచ్చు. ఫ్లైట్‌లో వెళ్తారు.

మొదటి రోజు

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి ప్రయాణం ఉంటుంది. ఉదయం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి విమానంలో బయలుదేరి కొచ్చి చేరుకుంటారు. హోటల్‌కు వెళ్లి లంచ్ ముగించిన తర్వాత.. ప్రసిద్ధ డచ్ ప్యాలెస్, మెరైన్ డ్రైవ్‌లను సందర్శిస్తారు. రాత్రికి కొచ్చిలోనే బస ఉంటుంది.

రెండో రోజు

ఉదయాన్నే అల్పాహారం ముగించుకుని దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ అతిరపల్లి జలపాతాన్ని (బాహుబలి ఫేమ్) సందర్శిస్తారు. వర్షాకాలంలో ఈ జలపాతం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆ తర్వాత గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించి తిరిగి కొచ్చి చేరుకుంటారు.

మూడో రోజు

కొచ్చి నుండి చెకౌట్ అయి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిల్ స్టేషన్ మున్నార్ కు ప్రయాణమవుతారు. మున్నార్ చేరుకున్నాక హోటల్‌లో చెకిన్ అయి.. మెట్టుపెట్టి డ్యామ్, ఎకో పాయింట్లను సందర్శిస్తారు. రాత్రికి మున్నార్‌లో బస ఉంటుంది.

నాల్గో రోజు

ఉదయం మున్నార్ నుండి బయలుదేరి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమరకోమ్ చేరుకుంటారు. అక్కడ సాంప్రదాయ హౌస్‌బోట్‌లో చెకిన్ అవుతారు. హౌస్‌బోట్ క్రూయిజ్‌లో ప్రయాణిస్తూ లంచ్, డిన్నర్ ఆస్వాదిస్తారు. రాత్రికి హౌస్‌బోట్‌లోనే బస ఉంటుంది.

ఆరో రోజు

కుమరకోమ్ నుండి బయలుదేరి 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రివేండ్రం (తిరువనంతపురం) చేరుకుంటారు. మార్గమధ్యంలో సముద్రతీరాన అద్భుతంగా వెలసిన ఆళిమల శివాలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి త్రివేండ్రంలో బస.

ఏడో రోజు

ఉదయాన్నే శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత నేపియర్ మ్యూజియం చూసి మధ్యాహ్నానికి త్రివేండ్రం ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు. సాయంత్రం సురక్షితంగా హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

కేరళం మాన్‌సూన్ టూర్ ప్యాకేజీ ధరలు

ఒక్కో ప్యాసెంజర్‌కు అయ్యే ఖర్చు ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.41,000, ఇద్దరు కలిసి ఉంటే రూ.44,000, ఒక్కరే ఉంటే రూ.60,700, చైల్డ్ విత్ బెడ్ (5-11 సంవత్సరాలు)రూ.34,600, చైల్డ్ వితౌట్ బెడ్ (5-11 సంవత్సరాలు) రూ.30,600 వరకు ఉంటుంది.

బుకింగ్, మరింత సమాచారం కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ (irctctourism.com) సందర్శించవచ్చు లేదా ఐఆర్‌సీటీసీ ప్రతినిధులను సంప్రదించవచ్చు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా స్థానిక మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe