IRCTC Ayodhya-Kashi Punya Kshetra Yatra With Baidyanath Dham Yatra : తెలుగు రాష్ట్రాల మీద నుంచి కాశీ యాత్రకు వెళ్లాలి అనుకునేవారికి ఐఆర్‌సీటీసీ మిడిల్ క్లాస్ బడ్జెట్‌లో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఐఆర్‌సీటీసీ అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్ ధామ్ పేరుతో టూర్ రన్ చేస్తోంది. డిసెంబర్ 5వ తేదీన ప్రయాణం మెుదలవుతుంది. పూరి, కోణార్క్, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్, బైద్యనాథ్ దర్శించుకోవచ్చు. సికింద్రాబాద్, హైదరాబాద్, చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం రైల్వే స్టేషన్ల నుంచి టూర్ ఉంటుంది. 10 రోజులు, 9 రాత్రులు వెళ్తారు.
టూర్ సాగనుంది ఇలా

మెుదటి రోజు డిసెంబర్ 5వ తేదీన బయల్దేరుతారు. రెండో రోజు డిసెంబర్ 6వ తేదీన మలాతిపత్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని, రోడ్డు మార్గంలో పూరీకి వెళ్తారు. అక్కడ బస చేసే ప్రదేశానికి చేరుకుంటారు. ఆ తర్వాత శ్రీ జగన్నాథ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి పూరీలోనే బస ఉంటుంది.
మూడో రోజు ఉదయాన్నే అల్పాహారం తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి కోనార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్తారు. తరువాత బనారస్‌కు వెళ్లే రైలు ఎక్కడానికి మిమ్మల్ని మలాతిపత్‌పూర్ రైల్వే స్టేషన్‌లో దింపుతారు.
నాలుగోరోజు బనారస్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుండి బస కోసం సారనాథ్‌కు వెళ్తారు. ఐదో రోజు అల్పాహారం తర్వాత, కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణా దేవి ఆలయాలను సందర్శిస్తూ రోజంతా తిరుగుతారు. సాయంత్రం గంగా హారతిని వీక్షిస్తారు. ఆరో రోజు అయోధ్యకు ప్రయాణాన్ని కొనసాగించేందుకు వారణాసి రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కుతారు. అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌కు (అయోధ్య) చేరుకుంటారు. శ్రీ రామజన్మభూమి, హనుమాన్‌గఢీలను సందర్శిస్తారు. రాత్రి భోజనం తర్వాత ప్రయాగ్‌రాజ్ వైపు తదుపరి ప్రయాణం కోసం మిమ్మల్ని అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌లో దించుతారు, అక్కడ మీరు రైలు ఎక్కవచ్చు.
ఏడో రోజు ప్రయాగ్ సంగం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. పవిత్ర త్రివేణి సంగమం – గంగా, యమునా, సరస్వతిని సందర్శించడానికి వెళ్తారు. ఆ తర్వాత బైద్యనాథ్ ధామ్‌కు వెళ్లడానికి ప్రయాగ్‌రాజ్ సంగం రైల్వే స్టేషన్‌లో మిమ్మల్ని డ్రాప్ చేస్తారు.
{{/usCountry}}ఏడో రోజు ప్రయాగ్ సంగం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. పవిత్ర త్రివేణి సంగమం – గంగా, యమునా, సరస్వతిని సందర్శించడానికి వెళ్తారు. ఆ తర్వాత బైద్యనాథ్ ధామ్‌కు వెళ్లడానికి ప్రయాగ్‌రాజ్ సంగం రైల్వే స్టేషన్‌లో మిమ్మల్ని డ్రాప్ చేస్తారు.
{{/usCountry}}ఎనిమిదో రోజు మధుపూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. బస చేసే ప్రదేశానికి వెళ్తారు. అక్కడ స్నానాలు ముగించుకుని రెడీ అవుతారు. ఆ తర్వాత బాబా బైద్యనాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. తిరిగి సికింద్రాబాద్‌కు బయలుదేరే రైలు ఎక్కేందుకు రైల్వే స్టేషన్ వద్దకు వెళ్తారు. తొమ్మిదో రోజు రైలులో ప్రయాణం ఉంటుంది. పదో రోజు అంటే డిసెంబర్ 13వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో ట్రైన్ ఎంటర్ అవుతుంది. దీంతో టూర్ ముగుస్తుంది.
టూర్ బడ్జెట్
అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్ ధామ్ టూర్ బడ్జె్ట్ విషయానికొస్తే.. ఎకానమీ స్లీపర్ పెద్దవారికి రూ.17,000, 5 ఏళ్ల నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.15,800, స్టాండర్డ్ 3ఏసీ పెద్దలకైతే రూ.26,400, పిల్లలకైతే 25,000గా నిర్ణయించారు. ఇక కంఫర్ట్ క్లాస్ 2ఏసీ పెద్దలకు రూ.34,400, చిన్నారలకు 32,700గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను www.irctctourism.com సందర్శించండి.
ABOUT THE AUTHOR
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.