వైజాగ్, అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా…? అయితే హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూరిజం నుంచి ప్యాకేజీ వచ్చేసింది. బడ్జెట్ ధరలోనే ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్ 27వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు.
టూర్ షెడ్యూల్ వివరాలు:
- హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 5.05 గంటల ట్రైన్ బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
- ఉదయం 5.55 గంటలకు విశాఖకు చేరుకుంటారు. హోటల్ కు చెకిన్ అవుతారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత…. ఖాళీమాతా ఆలయాన్ని దర్శించుకుంటారు. సబ్ మెరైన్ మ్యూజియంను చూస్తారు. భోజనం తర్వాత… కైలాసగరి హిల్స్, రుషికొండ బీచ్ కు వెళ్తారు. రాత్రి విశాఖలోనే బస చేస్తారు.
- మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత.. అరకుకు వెళ్తారు. తైదా జంగల్ బెల్స్, పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియంను సందర్శిస్తారు. గాలికొండ వ్యూ పాయింట్,బొర్రా కేవ్స్ ను చూస్తారు. రాత్రి తిరిగి విశాఖకు చేరుకుంటారు.
- బ్రేక్ ఫాస్ట్ తర్వాత సింహాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఆర్కే బీచ్ వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు విశాఖ నుంచి తిరిగి ప్రయాణమవుతారు.
- చివరి రోజు ఉదయం 06:15 గంటలకు హైదరాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది.

ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే… కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేర్ కు రూ. 27910, ట్విన్ షేరి్ంగ్ కు రూ. 17010, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 13370గా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 26010, డబుల్ షేరింగ్ కు రూ. 15110, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 11480గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు వేర్వురు ధరలుంటాయి. https://www.irctctourism.com/p వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 9701360701 మొబైల్ నెంబర్లను సంప్రదింవచ్చు.