షిర్డీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా…? హైదరాబాద్ నుంచి బడ్జెట్ ధరలోనే టూర్ ప్యాకేజీ వచ్చేసింది. మూడు రోజుల పాటు టూర్ ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తారు. ఐఆర్సీటీసీ టూరిజం తీసుకువచ్చిన ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా… షిర్డీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవచ్చు.

ఈ టూర్ ప్యాకేజీని “సాయి సన్నిధి EX హైదరాబాద్ ”పేరుతో ఆపరేట్ చేస్తున్నారు. ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లో ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలి. జర్నీ డేట్ కంటే ముందే టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ మార్చి 4వ తేదీన అందుబాటులో ఉంది.
2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.ఆసక్తి గల టూరిస్టులు https://www.irctctourism.com/ వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కామారెడ్డి, నిజామాబాద్, సికింద్రాబాద్ స్టేషన్లలో కూడా ట్రైన్ ఎక్కొచ్చు.
షిర్డీ టూర్ షెడ్యూల్ వివరాలు:
- మొదటి రోజు 1 : కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. సాయంత్రం 06.40 గంటలకు రైలు(ట్రైన్ నెంబర్ - 17064, అజంతా ఎక్స్ ప్రెస్) ఉంటుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
- రెండో 2 : ఉదయం 7.10 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటుంది. ఆ తర్వాత షిర్డీకి వెళ్లాలి. హోటల్ వెళ్లిన తర్వాత.. షిర్డీ సాయిబాబు ఆలయ సందర్శనకు వెళ్లాల్సి ఉంటుంది. సాయంత్రం 05 గంటలకు రూమ్ చెక్ ఔట్ చేయాలి. రాత్రి 08. 30 గంటల వరకు నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు.
- మూడో 3 :మూడో రోజు ఉదయం 09:45 గంటలకు కాచిగూడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
హైదరాబాద్ - షిర్డీ ట్రిప్ - తగ్గిన ధరలు
జనవరి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ధరల ప్రకారం…సింగిల్ షేరింగ్ కు రూ.7890గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 6660,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6640గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే ట్రిపుల్ షేరింగ్ కు రూ. 4960, డబుల్ షేరింగ్ కు రూ. 4980, సింగిల్ షేరింగ్ కు రూ. 6220గా నిర్ణయించారు.
{{/usCountry}}జనవరి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ధరల ప్రకారం…సింగిల్ షేరింగ్ కు రూ.7890గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 6660,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6640గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే ట్రిపుల్ షేరింగ్ కు రూ. 4960, డబుల్ షేరింగ్ కు రూ. 4980, సింగిల్ షేరింగ్ కు రూ. 6220గా నిర్ణయించారు.
{{/usCountry}}గతేడాది డిసెంబర్ నాటితో పోల్చితే ప్రస్తుతం ఈ ప్యాకేజీ ధరలు తగ్గాయి. అప్పుడు సింగిల్ షేరింగ్ కు రూ.8790, డబుల్ షేరింగ్ కు రూ. 7110,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6940గా ఉండేది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం చూస్తే… కొంతమేర ధరలు తగ్గాయి.
ఇక ఈ ప్యాకేజీలో టూర్ టికెట్లు, లంచ్, డిన్నర్, టూర్ గైడ్ అందుబాటులో ఉంటాయి. ఏదైనా వ్యక్తిగత ఖర్చులు ఉంటే మీరే భరించుకోవాలి. ఏమైనా సందేహాలు ఉంటే 040-27702407, 9701360701 నెంబర్లను సంప్రదించాలి.