సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీని వీడనున్నారు. ఈ మేరకు ఆయనే క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో మెుదటి నుంచి కీలక నేతగా ఉన్నారు. అయితే రానురాను పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతూ వచ్చారు. ఇందుకు కారణం ఎమ్మెల్యే సంజయ్. కాంగ్రెస్ పార్టీ సంజయ్‌కి ప్రాధాన్యం ఇస్తుందని జీవన్ రెడ్డితోపాటు ఆయన అనుచరులు కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు.

తాజాగా ఇవి ఎక్కువ అయ్యాయి. చివరకు జీవన్ రెడ్డి పార్టీని వీడే పరిస్థితికి వచ్చారు. జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్‌గా పిలిచే జీవన్ రెడ్డి నివాస ప్రాంగణంలో సోమవారం సాయంత్రం ఆయన సన్నిహితులు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించారు.
జగిత్యాల జిల్లాలో పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలను విస్మరించి, పార్టీలోకి కొత్తగా చేరిన వారికి అనవసరమైన ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తూ జీవన్ రెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జరిగిన జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కొత్తగా చేరిన వారికే సీట్లలో ఎక్కువ భాగం కేటాయించడంపై ఆయన తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. ఈ విషయం హైదరాబాద్ వరకూ వచ్చింది. ఈ క్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనుచరులపై ఆయన తన విమర్శల దాడిని మరింత తీవ్రతరం చేశారు.
తాను ఇంకా బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నానని సంజయ్ కుమార్ చెబుతున్నప్పటికీ.. గత నెలలో చొప్పదండిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ వేదికపై సంజయ్ కుమార్ కనిపించడం జీవన్ రెడ్డి అనుచరులకు ఆగ్రహం తెప్పించింది.
కార్యకర్తలు, తన అనుచరుల కోసం కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్న తన అనుబంధాన్ని తెంచుకోవడానికి జీవన్ రెడ్డి సిద్ధమయ్యారు. జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే తన తదుపరి రాజకీయ అడుగుపై ఈ సీనియర్ నాయకుడు ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులు జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి ప్రయత్నించినప్పటికీ, వారి ప్రయత్నాలు ఫలించలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
{{/usCountry}}కార్యకర్తలు, తన అనుచరుల కోసం కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్న తన అనుబంధాన్ని తెంచుకోవడానికి జీవన్ రెడ్డి సిద్ధమయ్యారు. జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే తన తదుపరి రాజకీయ అడుగుపై ఈ సీనియర్ నాయకుడు ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులు జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి ప్రయత్నించినప్పటికీ, వారి ప్రయత్నాలు ఫలించలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
{{/usCountry}}జీవన్ రెడ్డి కూడా వేరే పార్టీల్లో చేరే విషయాన్ని ఇంకా ఆలోచించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడటం మాత్రం ఖాయం అని క్లారిటీ ఇచ్చారు. సిద్ధాంతలకు అనుగుణంగా పని చేస్తానని చెప్పారు. అయితే ఇటీవల జీవన్ రెడ్డి అనారోగ్యపాలైన విషయం కూడా తెలిసిందే. రాజకీయాలకు ఇక దూరం అవుతారేమో అని కూడా కొందరు చర్చించుకుంటున్నారు.
సోమవారం నాడు జీవన్ రెడ్డి తన నివాసం నుండి కలెక్టరేట్ వరకు మొక్కజొన్న రైతులతో కలిసి ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా జీవన్ రెడ్డి నేతృత్వంలోని రైతుల ప్రతినిధి బృందం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులకు ఒక వినతిపత్రాన్ని సమర్పించింది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఉగాది పండుగ నుండే తక్షణమే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని వినతిపత్రంలో కోరారు.