...
...
Next Story

జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్‌కు మూడు రోజులే గడువు.. డిసెంబర్ 1న కరెక్షన్ విండో!

జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్ గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవాలి.

Published on: Nov 24, 2025, 11:56:10 IST
Advertisement

ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోని బీఈ, బీటెక్‌, బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ మెయిన్‌ 1 రిజిస్ట్రేషన్ గడువు నవంబర్ 27వ తేదీ రాత్రి 9 గంటలకు ముగుస్తుంది. అదే రోజు రాత్రి 11.50 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ 31న ప్రారంభమయ్యాయి. గడువు నవంబర్ 27 వరకు ఉంది. ఈసారి ఆన్‌లైన్ దరఖాస్తు గడువులను పొడిగించబోమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే తెలిపింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు 10.60 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ మెయిన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. గత సంవత్సరం ఆన్‌లైన్ దరఖాస్తులు గణనీయంగా ఉన్నాయి. ఇప్పుడు జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్‌కు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

మరోవైపు డిసెంబర్ 1 నుండి 2 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు దిద్దుబాట్లు అందుబాటులో ఉంటాయి. ఫారమ్ నింపేటప్పుడు చేసిన తప్పులను సరిదిద్దడానికి కరెక్షన్ విండో తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే విడుదల చేసింది. ఈ ఆన్‌లైన్ దిద్దుబాట్లు డిసెంబర్ 2న రాత్రి 11:50 గంటల వరకు కూడా అందుబాటులో ఉంటాయి.

పరీక్ష కేంద్రాల వివరాలను జనవరి మెుదటివారంలో ప్రకటిస్తారు. పరీక్షకు మూడు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల చేస్తారు. పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 12వ తేదీన వస్తాయి. మెుత్తం 13 భాషల్లో పరీక్షలు జరుగుతాయి. ఈసారి ఫిజికల్ కాలిక్యూలేటర్లకు అనుమతి లేదు. కొత్తగా ఆన్‌స్క్రీన్ వర్చువల్ కాలిక్యులేటర్ కంప్యూటర్ తెరపై ప్రత్యక్షం అవుతుంది.

అప్లికేషన్ సమయంలో గుర్తింపు నిర్ధారణ కోసం వెబ్‌కామ్ ద్వారా లైవ్ పొటో క్యాప్చర్‌తో పొటో తీస్తారు. సెక్షన్‌ ఏ, సెక్షన్‌ బీ రెండింటిలోనూ నెగెటివ్‌ మార్క్స్ ఉంటాయి. సెక్షన్ బీలో ఆప్షనల్ ప్రశ్నలు ఉండవు. ఈ సెక్షన్‌లో ఐదు ప్రశ్నలు ఇస్తారు. అన్నింటికీ సమాధానాలు రాయాలి. సెక్షన్ ఏలో ప్రతీ సబ్జెక్టుకు 20 బహుళైచ్చిక ప్రశ్నలు ఉంటాయి. సరైన సమాధానికి 4, తప్పు సమాధానికి 1 మార్కు కోత విధిస్తారు. ఎన్ఐటీలు, ఐఐటీల ప్రవేశం పొందడానికి 12వ తరగతి బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కాలు సాధించాలి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe