...
...
Next Story

హైదరాబాద్ హెచ్ఎంటీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూతో సెలక్షన్, వెంటనే అప్లై చేయండి

హైదరాబాద్‌లో మెయిన్ టూల్స్ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Published on: Feb 10, 2026, 13:55:58 IST
Advertisement

హైదరాబాద్‌లోని మెషిన్ టూల్స్ లిమిటెడ్(HMT) తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. ఆఫీసర్ (ఫైనాన్స్) 1, ఆఫీసర్(లీగల్) 1 ఉద్యోగాలు ఉన్నాయి. రెండు సంవత్సరాలు కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయనున్నారు. ఎంపికైన వ్యక్తుల పనితీరు ఆధారంగా మరో రెండు సంవత్సరాలు పొడిగించవచ్చు.

హైదరాబాద్ మెషిన్ టూల్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
హైదరాబాద్ మెషిన్ టూల్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

ఆఫీసర్ ఫైనాన్స్ ఉద్యోగానికి అప్లై చేసేవారు సంబంధిత రంగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఖాతాల నిర్వహణ / ఆడిట్ / పన్నులు / ఖర్చు, బడ్జెట్ మొదలైన వాటిలో ప్రత్యేక అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. అకౌంటింగ్ కార్యకలాపాలను నిర్వహించడం, బడ్జెట్, ఆర్థిక వంటి ఆర్థిక నివేదికలను సిద్ధం చేయాలి. బ్యాలెన్స్ షీట్, లాభం/నష్ట ప్రకటనలు చేయడంతోపాటుగా మరిన్ని విధులు ఉంటాయి.

ఆఫీసర్ లీగల్ ఉద్యోగానికి అప్లై చేసేవారికి సంబంధిత రంగంలో కనీసం 02 సంవత్సరాల అనుభవం ఉండాలి. పారిశ్రామిక చట్టం, కార్మిక చట్టంలో ప్రత్యేక అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. కంపెనీకి సంబంధించిన రోజువారీ చట్టపరమైన విషయాలు, కోర్టు కేసులను చూసుకోవాలి. పారిశ్రామిక వివాదాల చట్టం, ట్రేడ్ యూనియన్ సమస్యలు, కార్మిక కోర్టు చర్యలు, చట్టబద్ధమైన ఉద్యోగ సమ్మతికి సంబంధించిన విషయాలను నిర్వహించాలి.

చట్టపరమైన ప్రత్యుత్తరాలు, ఉత్తర ప్రత్యుత్తరాలను (రక్షణ ప్రకటన, క్లెయిమ్‌ల ప్రకటన, ప్రత్యుత్తరాలు దాఖలు చేయడం, ఇతర సంబంధిత పత్రాలు) సిద్ధం చేయడం తెలిసి ఉండాలి. కంపెనీ ద్వారా కుదిరిన MOU, NDA, వివిధ ఇతర ఒప్పందాలను రూపొందించడం, పరిశీలించడం చేయడంతోపాటుగా మరికొన్ని పనులు చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు జనరల్ ఈడౠ్ల్యఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750గా ఉంది.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250. పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు లేధని ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చివరి తేదీ 21-02-2026. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe