...
...
Next Story

Kavitha New Political Party : తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ - ముహూర్తం ఫిక్స్...!

బీఆర్ఎస్ కు దూరమైన కవిత… జాగృతి పేరుతో జనాల్లోకి వెళ్తున్నారు. అయితే ఆమె త్వరలోనే రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు తాను పోటీ చేయబోయే స్థానాలపై కూడా తాజాగా కీలక ప్రకటన చేశారు.

Published on: Feb 20, 2026, 16:20:05 IST
Advertisement

రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రాబోతుంది. ఆ దిశగా కల్వకుంట్ల రంగం సిద్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్ కు దూరమైన తర్వాత…. తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీసీలతో పాటు మహిళ రిజర్వేషన్ బిల్లుపై గట్టిగా వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. సందర్భాన్ని బట్టి కార్యక్రమాలను ప్రకటిస్తూ… జనాల్లోకి వెళ్తున్నారు. జాగృతి జనం బాట పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో కూడా కవిత పర్యటించారు. అయితే ఇకపై సంస్థ పేరుతో కూడా ప్రత్యేక రాజకీయ పంథాతో ముందుకెళ్లాళని భావిస్తున్నారు.

మే నెలలో పార్టీ ప్రకటన…!

కల్వకుంట్ల కవిత
కల్వకుంట్ల కవిత

మే నెల మొదటి వారంలో మంచి రోజు చూసుకుని పార్టీని అధికారికంగా ప్రకటిస్తామని కవిత తాజాగా ప్రకటించారు. తన స్థాపించబోయే పార్టీ పేరులో 'తెలంగాణ' అనే పదం తప్పనిసరిగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన పోటీపై కూడా కవిత క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని చెప్పిన ఆమె…. వచ్చే ఎన్నికల్లో తన మొదటి ఛాయిస్ సిద్దిపేట అని, రెండో ఛాయిస్ బోధన్ అని వెల్లడించారు.

భవిష్యత్తులో బీజేపీ ప్రభావం క్రమంగా తగ్గిపోతుందని కవిత వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్షంగా తామే అవుతామని కవిత ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తామే వస్తామని…. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు.

బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు తనతో కలిసి నడవడానికి ఆసక్తిగా ఉన్నారని కవిత చెప్పుకొచ్చారు. తాము స్థాపించబోయే పార్టీలో యువత, కొత్త వారికి పెద్దపీట వేస్తామన్నారు.

ఇక ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా కవిత తన మద్దతుదారులను ఏఐబీఎఫ్ పార్టీ బీ-ఫామ్‌పై పోటీ చేయించారు. పలు స్థానాల్లో వారు విజయం కూడా సాధించారు. ఈ క్రమంలోనే ఓ రాజకీయ పార్టీని స్థాపించి… 2029 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళ్లాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అక్కడే ఎందుకు ఫోకస్…!

ఇక బోధన్ నుంచి చేసే విషయంలో కూడా కవిత ఓక్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఆమె నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. బోధన్ కూడా ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే బోధన్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.

మొత్తంగా కవిత వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా మారాయి. ఆమె ఏర్పాటు చేయబోయే పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుంది..? ఏ పార్టీపై ప్రధానంగా ప్రభావం చూపబోతుందనేది భవిష్యత్ పరిణామాలతో తేలిపోనుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks