జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ వాళ్లు సోషల్ మీడియాలో ఉద్యమం చేస్తున్నారు తప్ప గ్రౌండ్ లో చేయలేదన్నారు. అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటేనే… ప్రతిపక్ష పార్టీ ఏ స్థాయిలో పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. కృష్ణార్జునుల్లా(కేటీఆర్ - హరీశ్ రావు) సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ లేదని విమర్శలు గుప్పించారు.
మరోసారి తీవ్ర విమర్శలు

ఇవాళ మెదక్ లో మీడియాతో మాట్లాడిన కవిత… జూబ్లీహిల్స్ ఎన్నికలో కుట్రలు కూడా జరిగాయని వ్యాఖ్యానించారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని చెబుతానని చెప్పారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో పని చేయలేదనేది స్పష్టంగా కనిపించిందన్నారు. క్షేత్రస్థాయిలో పెద్దగా పని చేయలేదన్నారు. ప్రజల కోరిక మేరకు బీఆర్ఎస్ పోరాడితే… ఫలితం మరోలా ఉండేందని అభిప్రాయపడ్డారు.
“రెడ్డిపల్లిలో 400 ఎకరాల ఫాంహౌస్ కట్టారు. ఇందుకోసం రీజినల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్చారు. దీనివల్ల 56 మంది రైతుల 59 ఎకరాలు పోతున్నాయి.. ఎకరం, అర ఎకరం ఉన్న చిన్న రైతులు నష్టపోతున్నారు. కేటీఆర్, హరీష్ రావు...కేసీఆర్ సార్ కళ్లకు గంతలు కట్టి అరాచకాలు చేసే నాయకులను సేఫ్ గార్డ్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు" అని కవిత కామెంట్స్ చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా కవిత స్పందించారు. "కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన బయటికి వస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది" అని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్పై అవాస్తవ ప్రచారం మానుకోవాలని కవిత హితవు పలికారు.
{{/usCountry}}బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా కవిత స్పందించారు. "కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన బయటికి వస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది" అని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్పై అవాస్తవ ప్రచారం మానుకోవాలని కవిత హితవు పలికారు.
{{/usCountry}}కాంగ్రెస్ పాలనలో మెదక్ జిల్లాలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉందని కవిత విమర్శించారు. రేవంత్ రెడ్డి “యంగ్ ఇండియా స్కూల్” కు శంకుస్థాపన చేసి ఏడాది అవుతుంది కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదన్నారు. ప్రారంభించిన చాలా పనులు అలాగే ఉండిపోయాయని దుయ్యబట్టారు.
ఆసక్తికరమైన ట్వీట్:
శుక్రవారం జూబ్లీహిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత… జాగృతి అధ్యక్షురాలు కవిత ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘కర్మ హిట్స్బ్యాక్’ అంటూ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్టుపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కవిత ట్వీట్ పై నెటిజన్లు కూడా ఎక్కువ సంఖ్యలోనే స్పందించారు. బీఆర్ఎస్‌కు తగిన శాస్తి జరిగిందంటూ కొందరు కవిత ట్వీట్ కు మద్దతు తెలపగా.... కొందరు మాత్రం బీఆర్ఎస్‌కు అనుకూలంగా పోస్టులు చేశారు.