Kazipet Rail Manufacturing Unit : తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, రవాణా రంగాల అభివృద్ధిలో మరో కీలక మైలురాయి ఆవిష్కృతం కాబోతోంది. వరంగల్ పరిధిలోని కాజీపేటలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (RMU) పనులు విజయవంతంగా పూర్తి కావొచ్చాయి.

ఈ బహుళ ప్రయోజన రోలింగ్ స్టాక్ తయారీ కేంద్రాన్ని త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చి, సరికొత్త ఇంటర్‌సిటీ రైళ్ల తయారీని ప్రారంభించబోతున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రకటించారు. కాజీపేట రైల్వే తయారీ యూనిట్ ప్రగతిపై ఆయన ఉన్నతాధికారులతో కలిసి ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి,…. పనుల పురోగతి పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఐదేళ్లలో 200 ఆధునిక రైళ్ల తయారీ…
"తొలి దశలో భాగంగా రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఏకంగా 200 అత్యాధునిక ఇంటర్‌సిటీ రైళ్లను తయారు చేసే అద్భుతమైన లక్ష్యాన్ని కాజీపేట కేంద్రానికి కేటాయించాం" అని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. కాజీపేట కేంద్రంలో రూపుదిద్దుకోబోయే ఈ సరికొత్త ఇంటర్‌సిటీ రైళ్లు అత్యంత ఆధునిక సదుపాయాలతో ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నాయని తెలిపారు.
“ఇవి 20 కోచ్‌ల కాన్ఫిగరేషన్‌తో (20 బోగీలు) నిర్మితం కానున్నాయి. ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ (స్వయంచాలక తలుపులు), మెరుగైన వెంటిలేషన్ సిస్టమ్, సురక్షితమైన కోచ్ డిజైన్‌తో పాటు ప్రయాణంలో ఎలాంటి జెర్కులు (కుదుపులు) లేకుండా ఉండేందుకు వీలుగా ఆధునిక జెర్క్-ఫ్రీ కప్లర్స్, బోగీలను ఈ రైళ్లలో అమర్చనున్నారు” అని వివరించారు.
పట్టణాలను, నగరాలను కనెక్ట్ చేస్తూ షటిల్ సర్వీసుల తరహాలో నడిచే ఈ రైళ్లను దేశవ్యాప్తంగా తక్కువ దూరాల ప్రయాణాల కోసం ప్రత్యేకంగా కేటాయించనున్నారు. ఇవి సాధారణంగా సుమారు 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మార్గాలలో గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో రాకపోకలు సాగిస్తాయి. తక్కువ దూరంలో ఉండే పట్టణాల మధ్య ప్రజలు సులభంగా, వేగంగా ప్రయాణించేందుకు వీలుగా ప్రతి ట్రిప్‌లోనూ ఈ రైళ్లకు ఎక్కువ సంఖ్యలో స్టాపింగ్‌లు కల్పిస్తారు. ఈ ఇంటర్‌సిటీ రైళ్ల రాకతో రోడ్డు మార్గాల ద్వారా జరిగే స్థానిక రవాణా రద్దీ (Local Traffic) చాలా వరకు రైల్వే వైపు మళ్లుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ ఇంటర్‌సిటీ రైళ్ల రాకతో సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు ఎనలేని మేలు జరగనుంది. "తమ సమీప పట్టణాలు, నగరాల్లో ఉన్నత చదువుల కోసం ప్రతిరోజూ ప్రయాణించే విద్యార్థులకు, నిత్యం ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం వెళ్లే సామాన్య ప్రజలకు, అలాగే అత్యవసర వైద్య ఆరోగ్య అవసరాల కోసం నగరాలకు వెళ్లే రోగులకు ఈ రైళ్లు అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన సరికొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా మారుతాయి" అని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.
{{/usCountry}}ఈ ఇంటర్‌సిటీ రైళ్ల రాకతో సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు ఎనలేని మేలు జరగనుంది. "తమ సమీప పట్టణాలు, నగరాల్లో ఉన్నత చదువుల కోసం ప్రతిరోజూ ప్రయాణించే విద్యార్థులకు, నిత్యం ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం వెళ్లే సామాన్య ప్రజలకు, అలాగే అత్యవసర వైద్య ఆరోగ్య అవసరాల కోసం నగరాలకు వెళ్లే రోగులకు ఈ రైళ్లు అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన సరికొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా మారుతాయి" అని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.
{{/usCountry}}ఈ సరికొత్త రైళ్లలో మరో అద్భుతమైన పర్యావరణ అనుకూల సాంకేతికతను జోడించారు. ఇవి 'రీజెనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ' (Regenerative Braking Technology) తో పనిచేస్తాయి. అంటే ఈ రైళ్లకు బ్రేకులు వేసిన ప్రతిసారీ స్వయంచాలకంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అలా ఉత్పత్తయిన కరెంటును తిరిగి పవర్ గ్రిడ్‌కు సరఫరా చేస్తారు. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేయడమే కాకుండా… రోడ్డు రవాణాతో పోలిస్తే కార్బన్ ఉద్గారాలను భారీగా తగ్గిస్తుంది.
తెలంగాణకు నిరంతర సహకారం - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కాజీపేట రైల్వే యూనిట్ పనులు తుది దశకు చేరుకోవడం ,ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ ఆర్డర్లు దక్కడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి, పారిశ్రామిక వృద్ధికి నిరంతర సహకారం అందిస్తున్న ప్రధాని మోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. కాజీపేట రైల్వే యూనిట్ ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.