తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అనుసంధానిస్తూ నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ హైవే (NH-365BG) ఖమ్మం-దేవరపల్లి రోడ్డు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేసింది. రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే ఈ సరికొత్త జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను ఆదివారం నుంచే అనధికారికంగా అనుమతించారు. వారం రోజుల్లో ఈ హైవేను అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఖమ్మం జిల్లా తాళ్లంపాడు గ్రామం వద్ద ప్రారంభమయ్యే ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం, దాని అనుబంధ మౌలిక వసతులు ఏడాది క్రితమే పూర్తయినప్పటికీ ధంసలాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం ఆలస్యం కావడంతో ఇన్నాళ్లూ ప్రారంభం వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఆర్‌వోబీ పనులు పూర్తికావడంతో వాహనదారులు తాళ్లంపాడు నుంచే నేరుగా హైవేపైకి ప్రవేశించే వెసులుబాటు లభించింది.
ఈ 162.04 కిలోమీటర్ల పొడవైన రహదారి అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికులకు సమయం భారీగా ఆదా కానుంది. హైదరాబాద్ నుండి విశాఖపట్నం మధ్య ప్రయాణ దూరం సుమారు 56 కిలోమీటర్లు తగ్గడంతో పాటు, ప్రయాణ సమయం 1 నుండి 2 గంటల వరకు కలిసిరానుంది.
తిరువూరు, నూజివీడు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, ఒడిశా, కోల్‌కతా వైపు వెళ్లే వాహనాలు ఖమ్మం నగరం లోపలికి రాకుండా బైపాస్ ద్వారా నేరుగా వెళ్ళవచ్చు. సూర్యాపేట వైపు నుంచి వచ్చే వాహనాలు తాళ్లంపాడు టోల్ ప్లాజా వద్ద ఈ రోడ్డుపైకి ప్రవేశించి, ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వద్ద బయటకు వెళ్తాయి.
సమీపంలోని పట్టణాలకు వెళ్లేందుకు వీలుగా ఈ హైవేపై మొత్తం 9 చోట్ల ఇంటర్‌చేంజ్‌లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత, వేగం కోసం ఈ రహదారిపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్లకు గరిష్టంగా గంటకు 100 కి.మీ., బారీ వాహనాలకు గంటకు 80 కి.మీ. వేగపరిమితి నిర్ణయించారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తరహాలోనే ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ వసూలు చేసే విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రతి కిలోమీటర్‌కు సీసీటీవీ కెమెరాలను అమర్చారు. లారీలు, సరుకు రవాణా వాహనాల నిలుపుదల కోసం వందనం, చౌడవరం ప్రాంతాల్లో ట్రక్ లే-బై లను అభివృద్ధి చేశారు.
{{/usCountry}}హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తరహాలోనే ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ వసూలు చేసే విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రతి కిలోమీటర్‌కు సీసీటీవీ కెమెరాలను అమర్చారు. లారీలు, సరుకు రవాణా వాహనాల నిలుపుదల కోసం వందనం, చౌడవరం ప్రాంతాల్లో ట్రక్ లే-బై లను అభివృద్ధి చేశారు.
{{/usCountry}}మొత్తం రహదారి పొడవులో 105 కిలోమీటర్లు ఖమ్మం జిల్లా పరిధిలోనే ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను ఖమ్మం పరిధిలో మూడు ప్యాకేజీలుగా రూ.2,213.91 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేశారు. హైవేకి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయని, తాళ్లంపాడు యాక్సెస్ పాయింట్ నుండి వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చామని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు చెప్పారు. వారం రోజుల్లో ఈ రహదారిని అధికారికంగా ప్రారంభిస్తామన్నారు. ఆ తర్వాత టోల్ వసూలు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్‌వోబీలపై వాహనాల రాకపోకలు సురక్షితమేనా అని నిర్ధారించుకోవడానికి లోడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభంతో తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వ్యాపార, రవాణా రంగాలు మరింత వేగవంతం కానున్నాయి.