...
...
Next Story

అనుచరులతో కొండా దంపతుల కీలక భేటీ - సమావేశం తర్వాత ఢిల్లీకి పయనం! ఏం జరగబోతుంది..?

కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన తర్వాత కొండా సురేఖ దంపతులు తమ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. వరంగల్‌లోని కార్యకర్తలు, అనుచరులతో అత్యవసర భేటీ కానున్నారు.

Published on: Sep 13, 2026, 13:33:25 IST
Advertisement

ఇటీవలే చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల మధ్య వరంగల్ రాజకీయం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. రాష్ట్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన తర్వాత కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి తమ భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఇందులో భాగంగానే కొండా దంపతులు వరంగల్ నగరంలో తమ అనుచరులు, పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు.

బర్తరఫ్ తర్వాత తొలి భేటీ..!

మాజీ మంత్రి కొండా
మాజీ మంత్రి కొండా

వాస్తవానికి ఈ సమావేశాన్ని వరంగల్‌లోని కొండా సురేఖ నివాసం వద్ద నిర్వహించాలని భావించారు. అయితే, నగరంలో కురుస్తున్న వర్షం కారణంగా వేదికను మార్చాల్సి వచ్చింది. వర్షం తగ్గకపోవడంతో కార్యకర్తల భేటీని సమీపంలోని ఓహోటల్‌కు మార్చారు. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత కొండా దంపతులు తమ నియోజకవర్గ నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలతో విస్తృత స్థాయిలో ముఖాముఖి భేటీ కావడం ఇదే తొలిసారి కావడంతో ఈ సమావేశానికి తీవ్ర ప్రాధాన్యత ఏర్పడింది.

మరోవైపు… కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖకు కేబినెట్ స్థాయి కలిగిన ప్రాధాన్యత గల పదవిని ఇచ్చే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కేబినెట్ నుంచి తొలగించినప్పటికీ, పార్టీకి ఆమె అందించిన సేవలను పరిగణనలోకి తీసుకుని సముచిత స్థానం కల్పించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే వరంగల్‌లో కార్యకర్తలతో సమావేశం ముగిసిన వెంటనే, కొండా సురేఖ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని ఆమె అనుచర వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో భేటీ అయి భవిష్యత్ రాజకీయంపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks