కేటీఆర్‌కు సారీ చెప్పిన కొండా సురేఖ.. బీఆర్ఎస్‌లోకి రీ ఎంట్రీ ఇస్తారా?
గతంలో కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఈ విషయం పెద్ద దుమారం రేగింది. తాజాగా కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు.
తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో తాను చేసిన వ్యక్తిగత, నిరాధార వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణలు చెబుతూ మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే విమర్శలు చేశానని, కేటీఆర్‌ను గానీ ఆయన కుటుంబ సభ్యులను గానీ బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేస్తూ ఆమె చింతిస్తున్నట్లు పేర్కొన్నారు.

'బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిపై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది. కేటీఆర్ గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గాని నాకు ఎంతమాత్రం లేవు. నా వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను.' అని కొండా సురేఖ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
కొద్దిరోజుల క్రితమే కాంగ్రెస్ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించిన నేపథ్యంలో హఠాత్తుగా కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పడం వెనక రాజకీయ ప్రాధాన్యత ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పరిణామాల క్రమంలో సురేఖ మళ్లీ గులాబీ గూటికి చేరుతారా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వస్తోంది.
కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన కోర్టులో వేసిన పరువు నష్టం దావాను ఉపసంహరించుకునేలా చేయడమే ఈ క్షమాపణల వెనుక ప్రధాన ఉద్దేశమని భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో మంత్రి పదవిని కోల్పోయిన తర్వాత చట్టపరమైన సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు సురేఖ ఈ అడుగు వేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కొండా సురేఖ బీఆర్ఎస్‌లో చేరే అవకాశాలపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొండా సురేఖ తమ పార్టీలోకి వచ్చే ప్రసక్తే లేదని ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. కేటీఆర్, పార్టీ గురించిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెను తిరిగి పార్టీలోకి ఆహ్వానించడానికి నాయకత్వం సుముఖంగా లేదని గులాబీ వర్గాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తి లేదని కొండా సురేఖ ఇప్పటికే స్పష్టం చేశారు. పదవులు ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, భవిష్యత్తు ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫునే పోటీ చేస్తానని ఆమె మీడియా ముఖంగా వెల్లడించారు.
మంత్రి పదవి తొలగించడం, వెంటనే కేటీఆర్‌కు సారీ చెప్పడంతో కొండా దంపతుల రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ప్రచారాలు జోరందుకున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులలో కొండా సురేఖ బీఆర్ఎస్‌లో చేరే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. కొండా దంపతుల తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయనేది రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


