మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేయడంపై మాజీ మంత్రి కొండా సురేఖ స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేసి…. తనను పదవి నుంచి తొలగించేలా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒత్తిడికి గురిచేశారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. తనను కేబినెట్ నుంచి తీసివేయకపోతే తాను సీఎం పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానని రేవంత్ రెడ్డి దిల్లీ పెద్దలను బెదిరించారని…. దాంతో చేసేది లేక అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.
కుట్ర చేశారు - సురేఖ

నిజానికి తనను మంత్రివర్గం నుంచి తొలగించాలనే ఆలోచన కాంగ్రెస్ అధిష్టానానికి ఏమాత్రం లేదని, కేవలం రేవంత్ చేసిన బ్లాక్‌మెయిలింగ్ వల్లే ఈ నిర్ణయం వెలువడిందని సురేఖ స్పష్టం చేశారు. తన పదవి ఊడగొట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని…. ముఖ్యంగా కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిలు కలిసి ఈ కుట్రకు తెరతీశారని ఆరోపించారు.
సొంత పార్టీలోనే ఉంటూ తనను బలిచేశారని ఆవేదన వ్యక్తం చేసిన కొండ సురేఖ, సీఎం రేవంత్ రెడ్డి మూలాలు తెలుగుదేశం పార్టీలో ఉండటమే ఇందుకు కారణమని విమర్శించారు. "సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చారు కాబట్టే ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. వేం నరేందర్‌రెడ్డి లాంటి వారిని వెనుకుండి నడిపిస్తూ మైండ్ గేమ్‌లు ఆడిస్తున్నారు. నాపై తీసుకున్న చర్యలు కేవలం కక్షపూరితమైనవే. ఒంట్లో టీడీపీ రక్తం ఉన్నవాళ్లే ఇలాంటి పనులు చేస్తారు," అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడిగా ఉన్న సీనియర్ నేత డాక్టర్ జి. చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవడాన్ని కూడా సురేఖ తప్పుపట్టారు. చిన్నారెడ్డికి దీనితో ఎలాంటి సంబంధం లేదని, కేవలం తనను టార్గెట్ చేసే క్రమంలో ఆయనను బలి చేయడం ఎంతమాత్రం సరికాదని అన్నారు. ప్రభుత్వంలో ఎంతోమంది నేతలు విమర్శలు, కామెంట్స్ చేస్తున్నారని…. మరి వారిని లేదా వారి కుటుంబాలను ఎందుకు బాధ్యులను చేయడం లేదని ప్రశ్నించారు. "కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేసినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. ఎందుకు? నా కుమార్తె సుస్మితను మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారు?" అని రేవంత్ సర్కార్‌ను నిలదీశారు.
తమ కుమార్తె సుస్మిత వ్యాఖ్యల వివాదంపై స్పందిస్తూ.. "మహిళలు ఇండిపెండెంట్‌గా ఉండాలని, సొంతంగా ఎదగాలని రాహుల్ గాంధీ నిత్యం చెప్తారు. మరి మా బిడ్డ మాట్లాడితే నన్ను ఎందుకు బాధ్యులను చేస్తున్నారు…? నా కూతురు ఒక ఇండిపెండెంట్. ఆమెకు ఒక కుటుంబం ఉంది. రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఆమెకు ఉంది. తన తండ్రికి కనీసం ఒక్క కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కూడా ఇవ్వలేదనే బాధ ఆమె మనసులో ఉంది. అలాంటప్పుడు నా కూతురు మాట్లాడిన దానికి నన్ను బాధ్యురాలిని చేయడం ఏంటి? నా కూతురి వ్యక్తిగత అభిప్రాయాలను అడ్డుకునే హక్కు మాకు లేదు" అని తేల్చి చెప్పారు.
{{/usCountry}}తమ కుమార్తె సుస్మిత వ్యాఖ్యల వివాదంపై స్పందిస్తూ.. "మహిళలు ఇండిపెండెంట్‌గా ఉండాలని, సొంతంగా ఎదగాలని రాహుల్ గాంధీ నిత్యం చెప్తారు. మరి మా బిడ్డ మాట్లాడితే నన్ను ఎందుకు బాధ్యులను చేస్తున్నారు…? నా కూతురు ఒక ఇండిపెండెంట్. ఆమెకు ఒక కుటుంబం ఉంది. రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఆమెకు ఉంది. తన తండ్రికి కనీసం ఒక్క కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కూడా ఇవ్వలేదనే బాధ ఆమె మనసులో ఉంది. అలాంటప్పుడు నా కూతురు మాట్లాడిన దానికి నన్ను బాధ్యురాలిని చేయడం ఏంటి? నా కూతురి వ్యక్తిగత అభిప్రాయాలను అడ్డుకునే హక్కు మాకు లేదు" అని తేల్చి చెప్పారు.
{{/usCountry}}తనను కనీసం వివరణ కూడా అడగకుండానే దారుణంగా బర్తరఫ్ చేశారని సురేఖ ఆవేదన చెందారు. కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు ఇప్పటికే సమగ్రమైన లేఖ ఇచ్చానని…. అయినా తనను బలి చేయడం తీరని బాధ కలిగించిందన్నారు. అధిష్టానానికి రాసిన లేఖను కూడా మీడియాకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి తానంతట తానుగా రాజీనామా చేయలేదని, తనను ఎవరూ రాజీనామా చేయమని కూడా అడగలేదని, నేరుగా రేవంత్ రెడ్డే తనపై వేటు వేశారని స్పష్టం చేశారు.
సర్వే చేయించండి - సురేఖ
“మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పాలనతో సంతోషంగా ఉన్నారా? మీరు సంతోషంగా లేరని నాకు తెలుసు, మీకు తెలుసు. ఈరోజు నాకు జరిగింది, రేపు మీకూ జరుగుతుంది. ఇప్పటికైనా బయటికి వచ్చి మాట్లాడండి. మనం ఇస్తామన్న హామీలు ఇవ్వలేదు.. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై సర్వే చేయించాలని సూచిస్తున్నాను” అని సురేఖ మీడియాతో చెప్పారు.