కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో భారీ ‘యువ సమరభేరి’ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో మాట్లాడిన కేటీఆర్…. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేసీఆర్ కాదు… రేవంత్ రాజీనామా చేయాలి- కేటీఆర్

తిన్నది అరగక కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ రాజీనామా చేయడం ఏంటి….? 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి 1000 రోజులు గడిచినా నిరుద్యోగులను, ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి" అని డిమాండ్ చేశారు.
"2006లో కూడా ఇదే కరీంనగర్ గడ్డపై కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. అప్పట్లో కేసీఆర్ రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తే కరీంనగర్ ప్రజలు కాంగ్రెస్ వీపు పగలేలా తీర్పు ఇచ్చారు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో ఆయనే కేసీఆర్. ఇప్పుడు మళ్లీ కేసీఆర్‌తో పెట్టుకుంటే రేవంత్ రెడ్డికి అదే గతి పడుతుంది, జాగ్రత్త" అని హెచ్చరించారు. చేసిన మోసాలకు గాను 420 హామీలకు 420 సార్లు కాంగ్రెస్ నేతలు రాజీనామా చేయాలని అన్నారు. ఒక్క మంత్రిని బర్తరఫ్ చేయడం కాదు, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్నే ప్రజలు బర్తరఫ్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు.
కరీంనగర్ అంటేనే పోరాటాలకు పురిటిగడ్డ అని…. కేసీఆర్ కూడా ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని కేటీఆర్ గుర్తుచేశారు. "యువత పిడికిలి బిగిస్తే పెద్దపెద్ద ప్రభుత్వాలే కూలిపోయాయి. మోదీ కేంద్ర ప్రభుత్వమునే గడగడలాడించిన ఘనత మన యువతది. అలాంటి యువతకు ఈ రేవంత్ రెడ్డి ఒక లెక్కనా?" అని ప్రశ్నించారు.
అసెంబ్లీలో నిలదీస్తాం….
{{/usCountry}}కరీంనగర్ అంటేనే పోరాటాలకు పురిటిగడ్డ అని…. కేసీఆర్ కూడా ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని కేటీఆర్ గుర్తుచేశారు. "యువత పిడికిలి బిగిస్తే పెద్దపెద్ద ప్రభుత్వాలే కూలిపోయాయి. మోదీ కేంద్ర ప్రభుత్వమునే గడగడలాడించిన ఘనత మన యువతది. అలాంటి యువతకు ఈ రేవంత్ రెడ్డి ఒక లెక్కనా?" అని ప్రశ్నించారు.
అసెంబ్లీలో నిలదీస్తాం….
{{/usCountry}}ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, "రాష్ట్రంలో యువతకు స్కిల్ లేదని మాట్లాడే సీఎం రేవంత్‌కు అసలు స్కిల్ ఉందా? ఆయనకు సరిగ్గా దరఖాస్తు రాయడం కూడా రాదు. అక్షర దోషం లేకుండా ఏ భాషలోనూ రాయలేడు," అని ఎద్దేవా చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టి నిలదీస్తామని వెల్లడించారు.
యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని కేటీఆర్ వరుసగా ప్రశ్నించారు. “ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇచ్చారా? యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు.. చేశారా? ప్రైవేట్ కంపెనీల్లో 75 శాతం స్థానికులకే రిజర్వేషన్ చట్టం తెస్తామన్నారు.. ఏమైంది? కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు ఇచ్చారా? యువతకు రూ.10 లక్షల రుణాలు, రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇచ్చారా?” అని కేటీఆర్ నిలదీశారు.
అప్పుడు ‘యూత్ డిక్లరేషన్’ అన్న కాంగ్రెస్…. ఇప్పుడు ‘బూతు డిక్లరేషన్’తో ప్రజలను బూతులు తిడుతోందని మండిపడ్డారు. హామీల గురించి నిలదీస్తే సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి, మంత్రులు వాటాల కోసం కొట్టుకుంటున్నారని ఆరోపించారు.
అశోక్ నగర్‌లో అడుగుపెట్టి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రాహుల్ గాంధీ, ఓట్లు వేయించుకున్నాక అడ్రస్ లేకుండా పోయారని కేటీఆర్ విమర్శించారు. "రేవంత్ దగ్గర నెలకోసారి కలెక్షన్లు తీసుకుంటూ రాహుల్ గాంధీ ఢిల్లీలో మూటలు దాచుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సీఎం సీటును నెలకు ఒకసారి రెన్యువల్ చేయించుకుంటున్నారు. మీరు ఇక్కడికి రాకపోతే నిరుద్యోగ యువతతో కలిసి మేమే ఢిల్లీకి వస్తాం" అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ లేదు కానీ ‘స్కామ్ క్యాలెండర్’ నడుస్తోందని, నోటిఫికేషన్లు రావడం లేదు కానీ ‘లూటిఫికేషన్’ మాత్రం సాగుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ బూడిదయ్యే వరకు నిరుద్యోగులు నిప్పుకణికలై పోరాడాలని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కొన్ని తరాల పాటు కనిపించకుండాపోయేలా యువత తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు.