తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు సెప్టెంబర్ 2026 మాసం వరుస సెలవులతో రానుంది. వినాయక చవితితో పాటు పలు పండుగలు, సాధారణ వారాంతపు సెలవులు, ప్రభుత్వ ఐచ్ఛిక సెలవులు ఒకే నెలలో రావడం వల్ల పాఠశాలలకు సెలవులు లభించనున్నాయి. సెప్టెంబర్ నెలలో వచ్చే హాలిడేస్ లిస్ట్ చూడండి.
సెప్టెంబర్ 2026 సెలవులు

సెప్టెంబర్ 4 (శుక్రవారం): శ్రీకృష్ణ జన్మాష్టమి (కొన్ని పాఠశాలల్లో ఆప్షనల్/ఐచ్ఛిక సెలవు లేదా పరిమిత సెలవుగా ఉంటే, కొన్ని చోట్ల సాధారణ సెలవుగా అమలు చేస్తారు).
సెప్టెంబర్ 6 (ఆదివారం): సాధారణ వారాంతపు సెలవు.
సెప్టెంబర్ 12 (రెండో శనివారం): విద్యాశాఖ నిబంధనల ప్రకారం పాఠశాలలకు రెండో శనివారం సాధారణ సెలవు.
సెప్టెంబర్ 13 (ఆదివారం): సాధారణ వారాంతపు సెలవు.
సెప్టెంబర్ 14 (సోమవారం): వినాయక చవితి పండుగ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రకటించిన ప్రధాన ప్రభుత్వ సెలవు.(వరుసగా శని, ఆది, సోమవారాలు మూడ్రోజుల సుదీర్ఘ వీకెండ్ లభిస్తుంది).
సెప్టెంబర్ 20 (ఆదివారం): సాధారణ వారాంతపు సెలవు.
సెప్టెంబర్ 23 (బుధవారం): యజ్దహుమ్ షరీఫ్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధికారిక ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం సెలవు.
సెప్టెంబర్ 26 (నాలుగో శనివారం): నాలుగు శనివారాల పద్ధతిని పాటించే కొన్ని ప్రైవేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లకు సెలవు.
సెప్టెంబర్ 27 (ఆదివారం): సాధారణ వారాంతపు సెలవు.
పైన పేర్కొన్న సెలవుల తేదీలు అధికారిక ప్రభుత్వ క్యాలెండర్ల ఆధారంగా రూపొందించారు. అయితే జిల్లా కలెక్టర్ల నిర్ణయాలు లేదా స్థానిక విద్యా సంస్థలు, యాజమాన్యాల క్యాలెండర్ ఆధారంగా కొన్ని సెలవుల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. కొన్ని సందర్భంగా స్థానికంగా అవసరాన్ని బట్టి సెలవులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు వినాయకచవితి ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ఉంటుంది.
సెప్టెంబర్ నెలలో పలు పరీక్షలు ఉండే అవకాశం ఉన్నందున, లభించే సెలవులను ప్రయాణాలకు, చదువులకు అనుగుణంగా ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. వినాయక చవితి వంటి ప్రధాన పండుగలకు రెండు రాష్ట్రాల్లోనూ సెలవు ఉన్నప్పటికీ, యజ్దహుమ్ షరీఫ్ లేదా ఆప్షనల్ సెలవులు రెండు రాష్ట్రాల మధ్య స్వల్పంగా మారవచ్చు. అభ్యర్థులు తమ తమ పాఠశాలల నోటీసు బోర్డులు లేదా ప్రిన్సిపాళ్ల ప్రకటనలను తుది ప్రమాణంగా పరిగణించాలి.
{{/usCountry}}సెప్టెంబర్ నెలలో పలు పరీక్షలు ఉండే అవకాశం ఉన్నందున, లభించే సెలవులను ప్రయాణాలకు, చదువులకు అనుగుణంగా ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. వినాయక చవితి వంటి ప్రధాన పండుగలకు రెండు రాష్ట్రాల్లోనూ సెలవు ఉన్నప్పటికీ, యజ్దహుమ్ షరీఫ్ లేదా ఆప్షనల్ సెలవులు రెండు రాష్ట్రాల మధ్య స్వల్పంగా మారవచ్చు. అభ్యర్థులు తమ తమ పాఠశాలల నోటీసు బోర్డులు లేదా ప్రిన్సిపాళ్ల ప్రకటనలను తుది ప్రమాణంగా పరిగణించాలి.
{{/usCountry}}