...
...
Next Story

హైదరాబాద్ సీపీగా మహేశ్ భగవత్.. సజ్జనార్ బదిలీ.. 21 మంది ఐపీఎస్‌లు ట్రాన్స్‌ఫర్!

తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ సీపీగా మహేశ్ భగవత్ బాధ్యతలు అప్పగించారు.

Published on: Nov 12, 2026, 17:25:04 IST
Advertisement

రాష్ట్రవ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ, మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జీవోను విడుదల చేశారు. ఈ బదిలీల్లో భాగంగా అత్యంత కీలకమైన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ స్థానంలో మార్పు జరిగింది. ఇప్పటివరకు సీపీగా పనిచేసిన వి.సి. సజ్జనార్‌ను బదిలీ చేసి, ఆయన స్థానంలో లా అండ్ ఆర్డర్ డీజీపీగా ఉన్న మహేశ్ భగవత్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. అలాగే వి.సి. సజ్జనార్‌కు అగ్నిమాపక, విపత్తు స్పందన, అత్యవసర సేవల విభాగం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు అప్పగించింది.

21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

ఇప్పటివరకు ఆర్టీసీ ఎండీగా ఉన్న వై.నాగిరెడ్డిని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా బదిలీ చేయగా, గ్రేహౌండ్స్ ఆపరేషన్స్ డీజీగా ఉన్న డా. అనిల్ కుమార్‌కు ఆర్టీసీ ఎండీగా కీలక బాధ్యతలు అప్పగించారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఉన్న స్టీఫెన్ రవీంద్రను తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో (TG-TMARS) డైరెక్టర్‌గా నియమించారు.

సీఐడీ డీజీగా ఉన్న చారు సిన్హాను ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూనే, సీఐడీ బాధ్యతలను అదనంగా అప్పగించారు. జైళ్ల శాఖ డీజీగా ఉన్న డా. సౌమ్య మిశ్రాను మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా విభాగం డీజీగా బదిలీ చేశారు.

సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్‌కు కీలకమైన లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అలాగే శ్రీ బాల దేవి, వి. అరవింద బాబులకు కూడా కొత్త బాధ్యతలు దక్కాయి.

కీలక పోస్టింగ్‌ల వివరాలు

జైళ్ల శాఖ డీజీ: స్వాతి లక్రా

మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా విభాగాల డీజీ: సౌమ్య మిశ్రా

ఏసీబీ డీజీ: చారు సిన్హా

లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ: ఆకున్ సబర్వాల్

గ్రేహౌండ్స్, ఆక్టోపస్ డీజీ: విక్రమ్ సింగ్ మాన్

సివిల్ సప్లైస్ కమిషనర్: నాగిరెడ్డి

తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విభాగం: స్టీఫెన్ రవీంద్ర

మల్టీ జోన్-1 ఐజీ: కార్తికేయ

హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ (అదనపు బాధ్యతలు): జోయల్ డేవిస్

రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ, ప్రజా రవాణా, వివిధ కీలక విభాగాల పనితీరును మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బదిలీ అయిన అధికారులంతా తక్షణమే తమ నూతన బాధ్యతలను స్వీకరించనున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks