హైదరాబాద్‌లో ఘోరం.. కారు బానెట్‌పై 2 కి.మీ వ్యక్తిని ఈడ్చుకెళ్లిన డ్రైవర్
Hyderabad : హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తిని కారు బానెట్‌పై సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు.
హైదరాబాద్‌లోని మీర్‌పేటలో హిట్ అండ్ రన్ ఘటనలో తండ్రీకొడుకులు గాయపడ్డారు. అయితే కారు డ్రైవర్ అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తూ.. బాధితుడిని తన కారు బానెట్‌పైనే రెండు కిలోమీటర్ల దూరం పాటు అత్యంత దారుణంగా ఈడ్చుకెళ్లాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిలానీ అనే వ్యక్తి తన కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నాడు. కారులో వచ్చిన ఓ వ్యక్తి వీరి బైక్‌ను ఢీకొట్టాడు. మే 1వ తేదీ రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కదులుతున్న వాహనాన్ని పట్టుకుని వేలాడుతున్న వ్యక్తిని ఉన్న ఒక వీడియో వైరల్ అయింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
బైక్ నడుపుతున్న జిలానీ కుమారుడు దాదాపు 500 మీటర్ల ముందుగానే యూ-టర్న్ కోసం ఇండికేటర్ వేశాడు. కారు డ్రైవర్ అలా ఎందుకు వేశావని ప్రశ్నించాడు. దీంతో బైక్ మీద ఉన్నవారితో కారు డ్రైవర్‌కు మాటల యుద్ధం మెుదలైంది. ఈ ఘటన త్వరలోనే తీవ్రరూపం దాల్చింది. కారు డ్రైవర్ బైక్ నడుపుతున్న వ్యక్తి జుట్టు పట్టుకుని కొంత దూరం ముందుకు లాగాడు. ఈ సమయంలో బైక్‌కు కారు తగిలింది.
పరిస్థితిని చూసిన తండ్రి జిలాని జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించాడు. డ్రైవర్‌ను ఆపమని బలవంతం చేసే ప్రయత్నంలో అతను కారు బానెట్‌పైకి ఎక్కాడు. అయితే డ్రైవర్ ఆ వ్యక్తి బానెట్‌పై ఉండగానే దాదాపు 2 కిలోమీటర్ల దూరం కారును నడిపాడని పోలీసులు తెలిపారు.
చివరకు వాహనం మీద నుంచి జిలానీ కిందకు దిగాడు. కానీ కారు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. తాము మీర్‌పేట్ నుంచి ఎల్బీ నగర్‌కు ప్రయాణిస్తుండగా వెనుక నుంచి కారు తమ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన మొదలైందని బాధితుడు చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత కారు డ్రైవర్ తన కొడుకు జుట్టు పట్టుకుని వాహనాన్ని ముందుకు పోనిచ్చాడని, తన కొడుకు కిందపడి గాయపడ్డాడని ఆరోపించాడు. పరిస్థితి విషమించడంతో, వాహనాన్ని ఆపడానికి అతను బానెట్‌ను పట్టుకున్నానని చెప్పుకొచ్చాడు. 'కారు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా బాలాపూర్ వరకు నడిపి, అక్కడ ఆపాడు. నేను బానెట్ పైనుంచి దిగగానే డ్రైవర్ పారిపోయాడు.' అని బాధితుడు చెప్పాడు.
ఈ ఘటన జరిగిన అనంతరం, ఆ వ్యక్తి మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


