...
...
Next Story

Maoists Surrender : సీఎం రేవంత్‌ సమక్షంలో 130 మంది మావోయిస్టుల లొంగుబాటు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగుబాటుకు ముందుకొచ్చారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద లొంగుబాటు అని పోలీసులు చెబుతున్నారు.

Published on: Mar 7, 2026, 16:14:37 IST
Advertisement

మావోయిస్టుల లొంగుబాటుల విషయంలో తెలంగాణ పోలీసులు భారీ ఆపరేషన్లు చేస్తున్నారు. ఇటీవలనే దేవ్ జీతో పాటు పలువురు అగ్రనేతలు లొంగిపోయారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగుబాటుకు ముందుకొచ్చారు. ఆయుధాలను అందజేసి వీరంతా జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ మిలీషియా సభ్యులు, ఇతర నాయకులు, మహిళా నక్సలైట్లు ఉన్నారు.

భారీగా మావోయిస్టుల లొంగుబాటు
భారీగా మావోయిస్టుల లొంగుబాటు

బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు డీజీపీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రత్యక్ష ప్రసారం ఇక్కడ వీక్షించండి…

ముందుగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడారు.మొత్తం 130 మంది మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు. వీరిలో అత్యధికంగా ఛత్తీస్ ఘడ్ కు చెందినవారని, తెలంగాణ నుంచి ముగ్గురు, ఏపీ నుంచి ఒక్కరు ఉన్నారని పేర్కొన్నారు. లొంగుబాటు వేళ 124 ఆయుధాలను అందజేశారని వెల్లడించారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఇవాళ 130 మంది మావోయిస్టులు లొంగిపోయారని,ఇందుకోసం పోలీసులు తీవ్రమైన కృషి చేశారని చెప్పారు. శాంతియుత పోరాటం ద్వారానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారమని అభిప్రాయపడ్డారు. దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా చర్చల ద్వారానే పరిష్కరించుకునే పరిస్థితులు ప్రస్తుతం చేస్తున్నామని చెప్పారు. అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతలోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రజాసమస్యలపై ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడండని కోరారు. సమస్యలను పరిష్కరించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందన్నారు.

ఇటీవలే నేను మావోయిస్టు నేతలతో మాట్లాడాను. వారు కొన్ని సమస్యలను ప్రతిపాదించారు. వాటిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో చర్చించాను. లొంగిపోయిన వారి మెరుగైన జీవితానికి హామీ ఇవ్వాలని అమిత్‌ షా సూచించారు. ఆయనతో చర్చల తర్వాత మావోయిస్టు నేతలతో మళ్లీ చర్చించాను. మా చర్చల అనంతరం ఒకేసారి 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks