...
...
Next Story

నిరుద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త - వచ్చే నెలలో మరో జాబ్ నోటిఫికేషన్..! కీలక ప్రకటన

నిరుద్యోగులకు ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే నెలలో మరో జాబ్ నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. ఈ నోటిఫికేషన్ లో 114 సూపర్‌వైజర్ ట్రైనీ, 84 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులుంటాయని పేర్కొన్నారు.కారుణ్య నియామక కండక్టర్ల విషయంలో కూడా కీలక ఆదేశాలిచ్చారు.

Published on: Nov 13, 2025, 16:31:15 IST
Advertisement

ఆర్టీసీ లో రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలు అన్వేషించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. నగరంలో పెరుగుతున్న కొత్త కాలనీలకు అనుగుణంగా బస్సు రూట్ లు పెంచేలా స్టడీ చేయాలన్నారు. గురువారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన… పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు.

ఆర్టీసీ అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష
ఆర్టీసీ అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష

నష్టాల్లో ఉన్న ఆర్టీసీ డిపో లపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ఆదేశించారు. లాభాల్లోకి వచ్చేలా ఆయా డిపోలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అరంఘార్ లో అధునాతన బస్సు టెర్మినల్ నిర్మాణం కోసం ఆర్టీసీ , పోలీస్ శాఖల భూ బదలాయింపు పై చర్చించాలన్నారు. నగరంలో కొత్త బస్సు డిపో లకు స్థల పరిశీలన చేసి జిల్లా కలెక్టర్ తో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించారు.

బస్సు ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్ మానిటరింగ్ సిస్టం అమలు చేయాలని మంత్రి పొన్నం సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఫోర్త్ సిటీ లో బస్ టెర్మినల్ ఏర్పాటు ,బస్సు సౌకర్యాల పై అధ్యయనం చేయాలని వివరించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కండక్టర్ లు ,డ్రైవర్లు ఇతర ఉద్యోగులతో జూమ్ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ - మంత్రి పొన్నం

ఇప్పటికే ఆర్టీసీలో ఆర్టీసీలో 1000 డ్రైవర్లు,743 శ్రామిక్ పోస్టుల భర్తీకి ప్రాసెస్ నడుస్తోంది. త్వరలోనే పరీక్షలను నిర్వహించనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తయింది. ఇదిలా ఉండగానే ఆర్టీసీ మంత్రి పొన్నం మరో శుభవార్త చెప్పారు. వచ్చే నెలలో మరో కొత్త నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks