...
...
Next Story

రేవంత్ రెడ్డి వచ్చినా పరకాలలో నేనే ఎమ్మెల్యేని.. నేనే గెలుస్తా - మంత్రి కొండా సురేఖ కుమార్తె సవాల్

సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుష్మితా పటేల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవూరి ప్రకాశ్ రెడ్డితో రాజీనామా చేయిస్తే, తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని సవాల్ విసిరారు.

Published on: Aug 19, 2026, 16:08:08 IST
Advertisement

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్ లో మరోసారి మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిల లక్ష్యంగా కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కొండా సుష్మితా పటేల్
కొండా సుష్మితా పటేల్

ఇవాళ పరకాల నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా సుష్మితా పటేల్ ప్రసంగించారు. పరకాల నియోజకవర్గ రాజకీయాలపై సుష్మితా పటేల్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి వ్యవహారశైలిలో మార్పు వచ్చిందని అన్నారు. పొంగులేటి ముఖ్యమంత్రా.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా? అసలు ఎవరు సీఎం అనేది అర్థం కావడం లేదంటూ ఘాటుగా మాట్లాడారు.

ఎవరొచ్చినా నేనే ఎమ్మెల్యే….

"రేవంత్ రెడ్డి నువ్వొచ్చినా, ప్రకాశ్ రెడ్డి వచ్చినా… ఆయన తాతొచ్చినా పరకాల ఎమ్మెల్యేను నేనే. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా నేనే నిల్చుంటా… నేనే గెలుస్తా" అని సుష్మితా పటేల్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రెండేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల వరకు ఆగడం ఎందుకని ప్రశ్నించిన ఆమె….. ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డితో ఇప్పుడే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. రేవూరిని రాజీనామా చేయించి రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి ప్రచారం చేసినా సరే, అక్కడ రేవూరి గెలవరని జోస్యం చెప్పారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించి చూపిస్తానని బహిరంగంగా సవాల్ విసిరారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 'అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్' రాజకీయం నడుస్తోందని సుష్మితా పటేల్ ఎద్దేవా చేశారు. పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్న అసలు కాంగ్రెస్ నాయకులు, సభ్యులు ఎవరూ సంతోషంగా లేరని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సలహాదారుడిగా ఉన్న వేం నరేందర్ రెడ్డి పనితీరును ప్రశ్నిస్తూ….. గత మూడేళ్లలో ఆయన ఇచ్చిన సలహాలు ఏంటో చెప్పాలని నిలదీశారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి తన సోదరుడి షెల్ కంపెనీ కోసం దాదాపు రూ. 200 కోట్ల విలువైన విలువైన భూమిని కేటాయించారని ఆరోపించారు.

హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫోటోతో పాటు రేవంత్ రెడ్డి ఫోటోలు మాత్రమే వేశారని, అక్కడే ఉన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోటో ఎందుకు వేయలేదని నిలదీశారు. బీసీ నాయకులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత చులకనా అని ప్రశ్నించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశిస్తూ … "నీతో ఉన్న పొంగు ఎక్కువ సేపు పొంగదు. అక్కడ అసలు నువ్వు ముఖ్యమంత్రో లేక ఆయనే ముఖ్యమంత్రో అర్థం కావడం లేదు" అని వ్యాఖ్యానించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe